అసెంబ్లీలో తీర్మానం హర్షణీయం

27 Mar, 2023 01:28 IST|Sakshi
వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎస్సీ యునైటెడ్‌ ఫ్రంట్‌ నేతలు
ఏపీ ఎస్సీ యునైటెడ్‌ ఫ్రంట్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంపై ఏపీ ఎస్సీ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రతినిధులు ఆదివారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంజీ రోడ్డులోని జార్జిపేటలో సంఘ కార్యాలయం వద్ద ఎస్సీ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షులు బుర్రి బాబూరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సంఘ ప్రధాన కార్యదర్శి బుర్రి జగజ్జీవన్‌రావు మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలనేది 50 ఏళ్లుగా చేస్తున్న డిమాండ్‌ అన్నారు. దళిత క్రైస్తవుల అభ్యున్నతికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చెప్పారు. మతం మారినా వారి సామాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులు మారలేదని గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే గుర్తించాలనే డిమాండ్‌కు దేశంలోనే తొలి అడుగు ఏపీలో పడిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫ్రంట్‌ నాయకులు ఉలసాల జక్రయ్య, రమాదేవి, బుర్రి అజయ్‌, విజయ్‌, పల్లి రాము, దేవా, గుమ్మడి సతీష్‌, యారా శ్రీనివాసరావు, వల్లిమల్లి సౌభాగ్యం, పల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు