శ్రీవారి నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయలు

29 Nov, 2023 01:44 IST|Sakshi
జెండా ఊపి లారీని ప్రారంభిస్తున్న దాతలు

పెనమలూరు: తిరుమల తిరుపతిలోని శ్రీవారి ఆలయంలో నిత్యాన్నదానానికి కూరగాయలు అందించటం పూర్వ జన్మ సుకృతమని భక్తులు బొప్పన కృష్ణ, మాధురిదేవి దంపతులు పేర్కొన్నారు. పోరంకి నుంచి మంగళవారం శ్రీవారి నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయల లారీని దాతలు జెండా ఊపి ప్రారంభించారు. గతంలో కుటుంబరావు ఆధ్వర్యంలో శ్రీవారికి కూరగాయలు పంపేవారని పేర్కొన్నారు. ఆయన మరణానంతరం కుటుంబరావు మిత్రులు మండవ శ్రీనివాస్‌, నాగు, ధనేకుల సత్యనారాయణ సహకారంతో నిత్యాన్నదానానికి కూరగాయలు పంపుతున్నామని తెలిపారు. బొప్పన మిధిలేష్‌, పునీత్‌, లక్ష్మి, సస్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు