విద్యా వ్యతిరేక విధానాలను ఆపాలి: యూటీఎఫ్‌

20 Mar, 2023 01:26 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్రకార్యదర్శి ఎస్‌ మురళీమోహన్‌

విజయనగరం పూల్‌బాగ్‌: ఇప్పటికై నా విద్యా వ్యతిరేక విధానాలను ఆపాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక కేఎల్‌ పురంలో ఉన్న ఎన్‌పీఆర్‌ భవనంలో యూటీఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఈపీ పేరుతో 3,4,5 తరగతులను హైస్కూల్‌లో మెర్జింగ్‌ చేయడం ఆపాలని, ఇప్పటికే ఈ మెర్జింగ్‌ వల్ల రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 12 వేలకు పైగా ఉన్నాయని తెలియజేశారు. ఇలా పాఠశాలలన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారడం వల్ల నాణ్యమైన విద్య విద్యార్థులకు అందదని కాబట్టి మెర్జింగ్‌ను వెంటనే ఆపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్‌కు కొత్త బాడీని ఎన్నుకోగా యుటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జేఆర్సీ పట్నాయక్‌, జేఏవీ ఆర్కే ఈశ్వరరావు, గౌరవ అధ్యక్షుడిగా ఎ.సత్య శ్రీనివాస్‌, సహాధ్యక్షులుగా వి.ప్రసన్నకుమార్‌, జి.పార్వతి కోశాధికారిగా సీహెచ్‌.భాస్కరరావు, కార్యదర్శులుగా ప్రసాద్‌, వాసు, త్రినాథ్‌, పి.వాసు, రామినాయుడు, సూర్యారావు, తిరుపతినాయుడు, జీవీ రమణ రాజారావు, కేశవ, రాధా భవాని, శ్రీదేవి, ఎన్‌. సత్యనారాయణలు ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్స్‌గా కె.విజయగౌరి, డి.రాము, కె.శ్రీనివాసరావు, ఎం.అప్పలనాయుడు, కె.అప్పారావు, జి పద్మావతిలు ఎన్నికయ్యారు. ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా ఎ.శంకరరావు ఎన్నికయ్యారు. ఈ కౌన్సిల్‌లో వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు