● తొలి కలశం రూ.30 వేలకు దక్కించుకున్న భువనేశ్వర్‌ వాసి

31 Mar, 2023 02:24 IST|Sakshi
ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో పవిత్ర మరిచీ కుండ్‌

మరిచీకుండ్‌ జలం వేలం

భువనేశ్వర్‌: పట్టణంలోని ముక్తేశ్వర ఆలయం మరిచీకుండ్‌ జలం వేలాన్ని బుధవారం నిర్వహించారు. తొలి కలశాన్ని రూ.30 వేలకు భువనేశ్వర్‌కు చెందిన నిరంజన్‌ సోరెన్‌ భార్య మాలతీ సోరెన్‌ దక్కించుకున్నారు. అనంతరం ముక్తేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో బొడు నియోగుల వర్గం వేలం ఈ ప్రక్రియ చేపట్టింది. బొడు నియోగ సేవాయత్‌ తొలి కలశం రూ.30 వేలకు, రెండో కలశం రూ.16 వేలకు వేలం వేశారు. అంగుల్‌కు చెందిన అంజలి ప్రధాన్‌ మూడో కలశం వేలంలో రూ.8 వేలకు కొనుగోలు చేశారు. ఈ నీళ్లతో స్నానం చేయడం వల్ల సీ్త్రలకు సంతాన ప్రాప్తిస్తుందని ప్రజల నమ్మకం. ఏటా ఏకామ్ర క్షేత్రంలో లింగరాజు మహాప్రభువు రుకుణ రథయాత్ర పురస్కరించుకుని ముందు రోజు ఈ కుండం జలం వేలం వేయడం సంప్రదాయం. అంతకుముందు ఈ జలంలో యాత్ర ప్రక్రియలో భాగంగా రుకుణ రథ ప్రతిష్ట చేశారు. మారీచ్‌కుండ్‌ నీటితో రుకుణ రథం ప్రతిష్ట చేసిన అనంతరం నీటిని వేలం వేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వేలం ప్రక్రియ కొనసాగింది. ఈ ఏడాది 50మందికి పైగా సంతానం ఆకాంక్షిత మహిళలు వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రాంగణంలో స్థానిక పోలీసు, నగరపాలక సంస్థ(బీఎంసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రత్యేక విద్యుద్దీపాలతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఈ ప్రాంగణంలో తాత్కాలిక స్నానపు గదులు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు