నవమి ఉత్సవాలకు నేడే శ్రీకారం

31 Mar, 2023 02:24 IST|Sakshi
శ్రీరామనవమి ఊరేగింపు రూట్‌ మ్యాప్‌పై చర్చిస్తున్న పోలీసు అధికారులు

జయపురం యువరాణిని ఆహ్వానించిన హిందూ సమాజ్‌ ప్రతినిధులు

జయపురం: పట్టణంలో ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలను ఈ ఏడాది కూడా ఘనంగా జరిపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జయపురం హిందూ సమాజ్‌ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సబ్‌ డివిజన్‌ లోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొనున్నట్లు సమాజ్‌ ప్రతినిధులు తెలిపారు. అలాగే నవమి ఊరేగింపులో పాల్గోవాల్సిందిగా కోరుతూ జయపురం మహారాణి సబితా దేవీని బుధవారం ఆహ్వానించారు. దీనిపై ఆమె అంగీకారం తెలిపినట్లు సమాచారం. మరోవైపు ఉత్సవ యాత్ర పట్టణంలోని పవర్‌ హౌస్‌ కాలనీ నుంచి పలు వీధుల్లో జరగనుంది. దీనికి సంబంధించి రూట్‌ మ్యాప్‌పై సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారి హరి బీసీ, పట్టణ పోలీసు అధికారి సమ్మిత్‌ బెహరా, ఐఐసీ సంజీవ్‌ చర్చించారు. మరోవైపు వందేళ్లకు పైగా శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్న జయపురం జమాల్‌ శ్రీరామాంజనేయ మందిర కమిటీ ఈనెల 30 నుంచి జరుగనున్న నవరాత్రి కల్యాణ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలకు విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం 7.40 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహాలను తిరువీధులులో ఊరేగిస్తామని కమిటీ అధ్యక్షుడు రాజా తెలిపారు. 10.20 గంటలకు విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, అంకురార్పణ, అఖండ దీపారాధన చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1న ఉదయం 9.30 గంటలకు సీతారాముల కల్యాణాన్ని వారణాసి సత్యనారాయణ, సుంకర ఈశ్వరరావు సహకారంతో ఆలయ ప్రధానార్చకులు గన్నవరపు వెంకటరమణశర్మ నిర్వహించనున్నారని వెల్లడించారు. 6న లలితా సహస్రనామ కుంకుమార్చన, పుష్పార్చన, 7న ఉదయం 10.30 మద్ది సోదరుల ఆధ్వర్యంలో స్వామివారి పట్టాభిషేకం, 8న పూర్ణాహుతి హోమం, అనంతరం కలశ ఉద్వాసన పూజలు జరనున్నాయని వివరించారు. కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, విజయంతం చేయాలని కోరారు.

>
మరిన్ని వార్తలు