ఒకటే ఊరు.. రెండు పంచాయతీలు

17 Sep, 2020 07:41 IST|Sakshi

భువనేశ్వర్‌ : ఒకే గ్రామం కానీ రెండు పంచాయతీలు. రెండు పంచాయతీలకు చాలా వరకు ఒకటే. ఒకే ఊరికింద వారంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఆ గ్రామాలే మండలంలో కాశిదొరవలస, నారాయణప్పవలస పంచాయతీలు. 26 ఏళ్లక్రితం వరకు ఈ పంచాయతీలు రెండూ నారాయణప్పవలస గ్రామంపేరిట ఉండేవి. అప్పట్లో నాటి ప్రభుత్వం ఈ గ్రామాన్ని రెండు పంచాయతీలుగా విభజించింది. నారాయణప్పవలస గ్రామంలో ప్రధానవీధిలో ఓ స్తంభం వద్ద ఈ రెండు పంచాయతీలకు సరిహద్దు నిర్ణయించారు. అంతవరకు ఒకే గ్రామంగా ఉన్నవారంతా రెండు గ్రామాల వారిగా విడిపోయారు. 

బొబ్బిలి రూరల్ ‌: ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు కావడంతో నారాయణప్పవలసలో రామాలయం ఉంటే, కాశిందొరవలసలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. రేషన్‌షాపు, పాఠశాల నారాయణప్పవలసలో ఉన్నాయి. ఒకే రైల్వేస్టేషన్‌ కాశిందొరవలసలో ఉంది. దీనిని నారాయణప్పవలస రైల్వేస్టేషన్‌ అంటారు. కంచరగెడ్డ రిజర్వాయర్‌ కాశిందొరవలసలో ఉంది. ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు ఉండడంతో అంతా కలిసి వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. నారాయణప్పవలస గ్రామం ఒక పంచాయతీ కాగా దీని పరిధిలో ఏ గ్రామాలూ లేవు. కాశిందొరవలస గ్రామానికి కాశిందొరవలస, దీని పరిధిలో డొంగురువలస, ఎరకందొరవలస, చిలకమ్మవలస, మోసూరువలసలు ఉన్నాయి. గ్రామంలోఅంతా కలిసి హాయిగా కలిసి మెలిసి జీవిస్తున్నారు.  

మరిన్ని వార్తలు