‘అగ్రిమెంట్స్‌’కు హక్కులు

26 Feb, 2023 01:12 IST|Sakshi
పాకాలపాడులో సాదా బైనామాలపై అవగాహన పొందుతున్న రైతులు
2021 నవంబర్‌ వరకు జరిగిన సాదా బైనామాలను హక్కు పత్రాలుగా పరిగణిస్తూ దశాబ్దాల రైతుల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది. అన్‌ రిజిస్టర్‌ అగ్రిమెంట్ల ద్వారా భూములు కొనుగోలు చేసుకున్న రైతులు, తర్వాత వారి వారసుల అనుభవంలో ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో హక్కుదారులు కాలేకపోయారు. వీరికి పట్టాదారు పాసుపుస్తకాలు రాని పరిస్థితి. ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో పాత అగ్రిమెంట్లను అధికారిక హక్కు పత్రాలుగా గుర్తిస్తూ రైతులకు హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సత్తెనపల్లి: దశాబ్దాల తరబడి రెవెన్యూ శాఖలో అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భూముల రీ–సర్వే వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ముందుకు సాగుతోంది. మరోపక్క నిషేధిత భూములు (22ఏ) సమస్యల పరిష్కారానికి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో మరో రెవెన్యూ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. దశాబ్దాల తరబడి రైతులు ఎదురుచూస్తున్న ‘సాదా బైనామా’ సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసింది.
దీంతో సాదా బైనామా సమస్యలు పరిష్కారమై సంబంధిత వ్యవసాయ భూములపై శాశ్వత హక్కులు దక్కనున్నాయి. గతంలో తెల్ల కాగితాలు, స్టాంప్‌ పేపర్ల మీద వ్యవసాయ భూ లావాదేవీల అగ్రిమెంట్లు జరిగాయి. ఇటువంటి సాదా బైనామా లావాదేవీల భూములపై అధికారికంగా ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండవు. రెవెన్యూ శాఖలో ఆన్‌లైన్‌ కావు. ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం కూడా కుదరదు. ఇలా దశాబ్దాల క్రితం నుంచి జరిగిన లావాదేవీలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించి హక్కులు కల్పించాలని రైతులు సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే గత ప్రభుత్వాలు వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమస్యలుగా మిగిలిపోయాయి. ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు తగిన మార్గదర్శకాలను జారీ చేసింది.
దశాబ్దాలుగా పెండింగ్‌..
ఈ సాదా బైనామాల సమస్య ఇప్పటిది కాదు. దశాబ్దాల తరబడి పరిష్కారం కాని సమస్యగా రెవెన్యూ శాఖలో నిలిచిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. 2021 నవంబర్‌ వరకు జరిగిన సాదా బైనామాలకు అనుమతి ఇచ్చింది. ఈ మార్గదర్శకాలు ఆధారంగా రెవెన్యూ అధికారులు సమస్యలు పరిష్కారానికి కసరత్తు చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
పల్నాడు జిల్లాలో సాదా బైనామా సమస్యలు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో సాదా బైనామా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మండలాల వారీగా సాదా బైనామాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Ýë§é O»ñæ¯é-Ð]l*ÌS §éÓÆ> ¿¶æ*Ð]l¬ÌS Mö¯]l$-VøË$ B ¿¶æ*Ð]l¬-ÌSOò³ Ô>ÔèæÓ™èl çßæMýS$PË$ MýSÍ-µçÜ*¢ {糿¶æ$™èlÓ… ^èlÆý‡ÅË$ {糿¶æ$™èlÓ °Æý‡~-Ķæ$…™ø §ýlÔ>-»êªÌS ¯ésìæ çÜÐ]l$-çÜÅ-ÌSMýS$ ç³Ç-ÚëPÆý‡…

2021 నవంబర్‌ వరకు జరిగిన అగ్రిమెంట్లకే

2021 నవంబర్‌ వరకు జరిగిన సాదా బైనామా లావాదేవీలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు ఎకరాల లోపు భూమి ఉండే సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆపై భూమి ఉండే రైతులు మార్కెట్‌ ధర ప్రకారం రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

– కె.నగేష్‌, తహసీల్దార్‌, సత్తెనపల్లి

మరిన్ని వార్తలు