దాచేపల్లిలో వ్యక్తి దారుణ హత్య

26 Feb, 2023 01:12 IST|Sakshi
కోటేశ్వరరావు (ఫైల్‌)
దాచేపల్లి: దాచేపల్లిలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని కర్రతో కొట్టి చంపి శరీర భాగాలను ముక్కలుగా చేసి తగులబెట్టిన దారుణ సంఘటన చోటుచేసుకుంది. సీఐ షేక్‌ బిలాలుద్దీన్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లి నగర పంచాయతీలో గరికపాటి కోటేశ్వరరావు (43) పంప్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య దుర్గమల్లేశ్వరి, కుమారుడు శివశంకర్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచికల్లులో ఉంటున్నాడు. రాత్రి అచ్చాలగడ్డలోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద వాల్‌ కట్టేసి వస్తానని ఇంట్లో చెప్పి కోటేశ్వరరావు వెళ్లాడు. అప్పటికే అక్కడ వేచిఉన్న మరో పంప్‌ ఆపరేటర్‌, నిందితుడు బంబోతుల సైదయ్య తన భార్య పట్ల అసభ్యకరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావని ప్రశ్నించాడు. కోటేశ్వరరావు తలపై సైదయ్య కర్రతో బలంగా కొట్టాడు. మరణించాడని నిర్ధారించుకుని సైదయ్య ఇంటికెళ్లి కుమారుడు నాగరాజుకు విషయం చెప్పి డీజిల్‌, గోనెసంచితో వచ్చాడు. కోటేశ్వరరావు మృతదేహాన్ని నాగరాజు, సైదయ్య గోనెసంచిలో పెట్టుకొని ద్విచక్ర వాహనంపై ఆదర్శ పాఠశాల సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లారు. గొడ్డలితో శరీరాన్ని 14 ముక్కలు చేశాడు. శరీర భాగాలపై పత్తికట్టెను వేసి డీజిల్‌ పోసి నిప్పు పెట్టాడు. కోటేశ్వరరావు శరీర భాగాలన్నీ మంటల్లో కాలిబూడిద కాగా, కాలిపాదం మాత్రం కాలిపోలేదు. రాత్రి 11 గంటలైనా కోటేశ్వరరావు ఇంటికి రాకపోవటంతో తమ్ముడు సైదారావు, కుమారుడు శివశంకర్‌ వెతుకులాట ప్రారంభించారు. ఆదర్శ పాఠశాల సమీపంలో సైదయ్యను గమనించి కోటేశ్వరరావు ఎక్కడని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపో యాడు. సైదయ్య పొలంలో మంటల పక్కనే కాలిపాదాన్ని గుర్తించారు. దీంతో కోటేశ్వరరావు మృతదేహంగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సైదయ్య, అతని కుమారుడు నాగరాజు, సైదయ్య భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కర్ర, గొడ్డలి, కాలిపాదాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోటేశ్వరరావును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బాధిత కుటుంబం, రజక సంఘం నాయకులు కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వేపై శనివారం ఆందోళనకు దిగారు. చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడు కోటేశ్వరరావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిలాలుద్దీన్‌ తెలిపారు.

MýS{Æý‡™ø Mösìæt ^èl…í³ Ô¶æÈ-Æ>°² VöyýlzÍ™ø 14 Ð]l¬MýSPË$ ^ólíܯ]l OÐðl¯]l… yîlhÌŒæ ´ùíÜ Ð]l$–™èl$yìl ÔèæÈÆý‡ ¿êV>-ÌS¯]l$ ™èlVýS$-ÌS-»ñæ-sìæt¯]l °…¨-™èl$yýl$ çßæ™èlÅMýS$ Eç³-Äñæ*-W…_¯]l MýS{Æý‡, VöyýlzÍ ÝëÓ«-©¯]l…

>
మరిన్ని వార్తలు