రైతన్నకు శనగలు

18 Mar, 2023 00:48 IST|Sakshi
గొరిజవోలులో కోతకు సిద్ధమైన మంచి శనగ పంట
శనివారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2023

విస్తీర్ణం తగ్గినా దిగుబడి బాగుంది

ఈ ఏడాది మంచి శనగ పంట విస్తీర్ణం తగ్గినా దిగుబడి బాగుంది. వాతావరణం అనుకూలించింది. ఎప్పటికప్పు డు సూచనలు, సలహాలు ఇచ్చాం. ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించింది. ఆ ధర రైతులకు లభించేందుకు మా వంతు కృషిచేస్తున్నాం.

–ఐ.మురళి, జిల్లా వ్యవసాయాధికారి

పది క్వింటాళ్ల దిగుబడి

వచ్చింది

ఈ ఏడాది ఒక ఎకరంలో మంచిశనగ పంట వేశా. పది క్వింటాళ్ల వరకు బాగా దిగుబడి వచ్చింది. వాతావరణం అనుకూలించింది. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటించా. అందువల్లే పంట దిగుబడి పెరిగింది.

– పులి అంజిరెడ్డి,

విప్పర్ల రెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం

నరసరావుపేట: జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో రైతులు పండించిన మంచి శనగ వారికి ప్రోత్సాహాన్నిచ్చింది. పెట్టిన పెట్టుబడికి వచ్చిన దిగుబడికి తోడుగా ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధర రైతుకు ఊరట నిచ్చింది. గతేడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గినా వాతావరణం అనుకూలించి దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో సాగు రైతుల్లో సంతోషం కనిపిస్తోంది. జిల్లాలో సాధారణంగా 12 వేల హెక్టార్లలో మంచి శనగ సాగు చేసేందుకు అవకాశం ఉండగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా చిలకలూరిపేట, అమరావతి, నరసరావుపేట, రొంపిచర్ల, నాదెండ్ల, యడ్లపాడు, ఈపూరు మండలాల్లోని రైతులు 7729 హెక్టార్లలో పంట సాగుచేశారు.

జిల్లా, మండల వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు పంటలను పరిశీలించి పొలంబడి ద్వారా రైతులకు కావల్సిన సూచనలు, సలహాలు ఇస్తూ అధిక దిగుబడి సాధించేందుకు తమ వంతు కృషిచేశారు. మార్చి నాటికి దాదాపుగా పంట ముగిసే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే 90 శాతం రైతులు పంటను పండించి దిగుబడిని ఇళ్లకు చేర్చు కున్నారు. మరికొంత పంట కోసేందుకు సిద్ధంగా ఉంది. ఎకరాకు ఏడు నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి లభించింది. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు క్వింటాలుకు రూ.4,500లు వరకు చెల్లిస్తుండగా ప్రభుత్వం రూ.5335లు మద్దతు ధరను ప్రకటించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తోంది.

రైతుల సౌలభ్యం కోసం జిల్లాలోని 177 రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పంట వేసి ఇ–క్రాప్‌ చేయించుకున్న రైతుల జాబితాలను మార్క్‌ఫెడ్‌కు అందజేసి ఆ రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయిస్తుంది. తేమశాతం 14, పూర్తిగా తయారు కాని గింజలు ఆరుశాతం, నాలుగు శాతం పురుగు పట్టిన గింజలు, ఇతర వ్యర్ధ పదార్ధాలు ఒకశాతం ఉన్నా కూడా వెసులుబాటు కల్పించి మద్దతు ధరను అందజేస్తుంది. మూడు నెలల స్వల్పకాల పంటపై పెట్టిన పెట్టుబడికి ఎకరాకు రూ.20 వేలకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లుగా రైతులు తెలియ చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

77 రైతు భరోసా కేంద్రాలు

జిల్లాలో ఏడు మండలాల్లో

7,700 హెక్టార్లలో సాగు

ప్రభుత్వ మద్దతు ధరతో

రైతుకు చేకూరిన మేలు

177 ఆర్‌బీకేల ద్వారా

పంట కొనుగోలు కేంద్రాలు

మరిన్ని వార్తలు