సీఎం జగన్‌ మహిళా పక్షపాతి

26 Mar, 2023 02:06 IST|Sakshi
ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

మాచర్ల: రాష్ట్రంలో లక్షలాది డ్వాక్రా కుటుంబాలకు వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మేలు చేస్తూ గొప్ప మనసుతో మానవత్వాన్ని ప్రదర్శిస్తున్న ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదేనని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు మండలాలలో వేలాదిమంది మహిళలకు ఈ మూ డు విడతలలో రూ.121.33 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. మా చర్ల, మాచర్ల అర్బన్‌, దుర్గి, కారంపూడి, వెల్దుర్తి, రెంటచింతల లో మొదటి విడత రూ.40.24కోట్లు, రెండవ విడత రూ.40.26, మూడో విడత రూ.40.43కోట్లు నేరుగా మహిళ డ్వాక్రా ఖాతాలలో అందజేసినట్లు తెలిపారు. ఆయా సచివాలయాల పరిధిలో మూడు విడతలుగా ప్రతి డ్వాక్రా మహిళలకు సంక్షేమ పథకాలు అందించటంతోపాటు వైఎస్సార్‌ ఆసరా ద్వారా నియోజకవర్గంలోని వేలాది మంది మహిళ లకు మేలు చేస్తూ వారి కుటుంబాలలో అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. పేద మహిళలతోపాటు, అన్నీ వర్గాలకు మేలు చేసే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మరోసారి ఆశీస్సులందించాలని ఆకాంక్షించారు. లబ్ధిదారులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గంజాయి స్వాధీనం

గురజాల:గంజాయి సాగు చేసి విక్రయిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సెబ్‌ సీఐ కొండారెడ్డి సూచించారు. మండల పరిధి లోని దైద గ్రామంలో గంజాయి సా గు చేస్తున్నారనే ముందస్తు స మాచారం రావడంతో శనివారం తెల్లవారుజామున సెబ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన బి అమరానాయక్‌, ఎల్‌ శ్రీనునాయక్‌ల పొలంలో తనిఖీలు నిర్వహించారు. మిరప పంటలో నాలుగు గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. తనిఖీలు నిర్వహించగా 10 కేజీలు గంజాయి, 10 కేజీలు బరువు గల గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఇరువురి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు