123 ‘ఆలీవ్‌రిడ్లే’లు సముద్రంలోకి విడుదల

27 Mar, 2023 01:46 IST|Sakshi
తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల చేస్తున్న డీఎఫ్‌వో భీమయ్య

వేటపాలెం: మండల పరిధిలోని రామాపురం సముద్రతీరంలోని తాబేళ్ల సంరక్షణ కేంద్రం నుంచి 123 ఆలీవ్‌రిడ్లే తాబేళ్ల పిల్లలను బాపట్ల జిల్లా డీఎఫ్‌వో ఎల్‌ భీమయ్య ఆదివారం సముద్రంలోకి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సముద్రతీరంలో ఏర్పాటుచేసిన సంరక్షణ కేంద్రంలో ఎనిమిది తల్లి తాబేళ్ల నుంచి 950 గుడ్లు సేకరించామన్నారు. వీటిల్లో నాలుగు తాబేళ్ల నుంచి సేకరించిన 410 తాబేళ్లను నాలుగుసార్లుగా సురక్షితంగా సముద్రంలోకి వదిలామని పేర్కొన్నారు. మూడు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంటుందని చెప్పారు. ఆలీవ్‌ రిడ్లీ సముద్ర తాబేళ్లు మత్స్యకారులకు నేస్తాలన్నారు. ఇవి సముద్రంలోని నాచును తినడంవల్ల చేపలకు ఎంతగానో ఉపయోకరంగా ఉంటుందన్నారు. సముద్రంలోని జీవరాసులకు ఆక్సిజన్‌ అందించడంలోనూ, మత్స్య సంపద పెంపొందించడంలో తోడ్పతాయన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ట్రీ ఫౌండేషన్‌ ఎఫ్‌ఆర్‌ఓ ఆర్‌ శ్రీదేవి, ఎఫ్‌ఎస్‌ఓ, ఎఫ్‌బీఓ శవనం చంద్రారెడ్డి, లక్ష్మయ్య, నాగరాజు జాలయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు