వృద్ధుడి ఆత్మహత్య

18 Nov, 2023 00:38 IST|Sakshi
పి.బంగార్రాజు

వీరఘట్టం: మండలంలోని చిట్టపులివలసకు చెందిన ఏడాకుల రామయ్య(77) చీమలమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామయ్య భార్య ఆరు నెలల క్రితం చనిపోయింది.దీంతో ఆయన ఆలనాపాలనా చూసేవారు కరువవడంతో మరస్తాపం చెంది ఈనెల 15న చీమల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 16వ తేదీ రాత్రి మరణించాడు. మృతుడి పెద్ద కుమారుడు సింహాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎంవీ రమణ తెలిపారు.

అండర్‌–19 ఆంధ్రా క్రికెట్‌ జట్టు మేనేజర్‌గా బంగార్రాజు

విజయనగరం: అండర్‌–19 విభాగంలో బీసీసీఐ నిర్వహించే కుచ్‌ బెహర్‌ టోర్నీలో పాల్గొనే ఆంధ్రా క్రికెట్‌ జట్టు మేనేజర్‌గా విజయనగరానికి చెందిన మాజీ క్రీడాకారుడు పి.బంగార్రాజు నియమితులయ్యారు. ఈ నెల 17 నుంచి వచ్చేనెల 18 వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ టోర్నీ జరగనుంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్ర జట్లతో ఆంధ్రా జట్టు తలపడనుంది. జట్టు మేనేజర్‌గా ఎంపికై న బంగార్రాజును జిల్లా క్రికెట్‌ అసొసియేషన్‌ కార్యదర్శి ఎం.ఎల్‌.ఎన్‌.రాజు, ట్రెజరర్‌ పి.సీతారామరాజు, జిల్లా సెలెక్టర్లు వర్మ, సర్పరాజ్‌తో పాటు క్రికెట్‌ క్రీడాకారులు అభినందించారు.

మరిన్ని వార్తలు