పీఎల్‌ఆర్‌ బోనస్‌ చెల్లించండి

12 Nov, 2023 00:50 IST|Sakshi
మాట్లాడుతున్న నాయకులు
బొగ్గు బాయి

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి సంస్థ లాభాల్లో భాగమైన వివిధ సెక్షన్లలోని కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా పీఎల్‌ఆర్‌ బోనస్‌ చెల్లించాలని ఐఎఫ్‌టీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.అశోక్‌ డిమాండ్‌ చేశా రు. శనివారం ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ హౌస్‌ కీపింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మి, శారద, మేరీ, ఎం.లక్ష్మి, రాము, లింగయ్య, రాములు, రాజేశ్వరి, అనసూయ, బాబు, భాగ్య, శేఖర్‌, శ్రీనివాస్‌, రాజనర్సు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు