మహిళా బీమా కావాలి

12 Nov, 2023 00:50 IST|Sakshi

రైతుబీమా మాదరిగానే భూమి లేనిపేద మహిళ ల భద్రత కోసం బీమా సౌకర్యం కల్పించాలి. గ తంలో స్వశక్తి మహిళల కు అభయహస్తం, ఆమ్‌ఆద్మీ యోజన ద్వారా మహిళ చనిపోతే ఆమె కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.5వేలు అందేంది. అలాంటీ బీమా ప్రవేశపెట్టాలి.

– మారుపాక పద్మ, అడవిశ్రీరాంపూర్‌

రాయితీ రుణాలివ్వాలి

మహిళల జీవనోపాధి కోసం రాయితీపై రుణాలు మంజూరు చేయాలి. రైతురుణమాఫీ మాదిరిగానే స్వశక్తి మహిళలకు రుణాలు మాఫీ చేయాలి. స్వశక్తి మహిళల పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య అందించాలి. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.

– బొల్లపల్లి లలిత, లక్కారం, ముత్తారం

అవగాహన ఉండాలి

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై అవగాహన ఉండాలి. గ్రామాభివృద్ధికి పాటుపడే నాయకుడిని ఎన్నుకోవాలి. ఎన్నికై న పాలకులు తమస్వార్థం కోసం కాకుండా ప్రజాసంక్షేమం ఆలోచన చేసే నాయకుడికి పట్టం కట్టాలి. ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలి.

– చల్ల లత, పోతారం, ముత్తారం

మరిన్ని వార్తలు