రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు

20 Nov, 2023 01:38 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన కారు

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం పొలాస గ్రామ శివా రులో ఆదివారం మధ్యాహ్నం జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గా యాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పొలాస గ్రామానికి చెందిన హాకాజ్‌, రిషిక్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా పొలాస శివారులోని ప్ర ధాన రోడ్డుపై వీరి బైక్‌ను కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థాని కులు 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు