ఈవీఎంలో అభ్యర్థుల కూర్పు ఇలా..

20 Nov, 2023 01:38 IST|Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: ఎన్నికల క్షేత్రంలో తలబడటమంటే అభ్యర్థికి అన్ని రకాల టెన్షన్‌ టెన్షన్‌. సెంటిమెంట్లు, ప్రలోభాలు, కుతంత్రాలు ఇదొక పార్శ్వమైతే ఈవీఎంలో తాను ఎక్కడున్నది ఓటరుకు తెలుపడానికి అనువైన నంబర్‌, చోటు కోసం అభ్యర్థులు అపసోపాలు పడుతుంటారు. అధికారులు మాత్రం బ్యాలెట్‌ కూర్పులో ఏ మాత్రం పొరపాటు లేకుండా ఎన్నికల కమిషన్‌ సూచించిన నియమావళి, మార్గ దర్శకాలను అనుసరించి ఒకటికి రెండు సార్లు చూసి వివరాలు ప్రకటిస్తారు.

అదెలాగంటే..

● తొలుత గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులను ఎంచుకుంటారు. నామినేషన్‌ పత్రాల్లో తమ పేరు, ఇంటి పేరు నమోదు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి.

● అందుకే నామినేషన్లతో పాటు బ్యాలెట్‌లో అభ్యర్థి పేరు ఎలా ఉండాలని కోరుకుంటారో.. ప్రత్యేకంగా రాసి ఇవ్వాలని సూచిస్తారు. ఇదే బాలెట్లో సదరు అభ్యర్థికి చోటు కేటాయించేందుకు అధికారులకు ఆధారం.

● అభ్యర్థుల ప్రాధాన్య క్రమాన్ని నిర్ధారించేందుకు మొదట జాతీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తారు.

● వారిచ్చిన పేరులో మొదటి అక్షరాలను పరిశీలించి, తెలుగు వర్ణమాల(పెద్ద బాలశిక్ష)లోని అక్షరాలు, గుణింతల ఆధారంగా వరుస క్రమాన్ని నిర్ధారిస్తారు.

● జాతీయ పార్టీల అభ్యర్థులను గుర్తించి వారికి వరుస సంబరు కేటాయించిన అనంతరం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ అభ్యర్థులను నమోదు చేస్తారు.

● ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్ర పార్టీల అభ్యర్థులుంటే వారికిచ్చిన పేరు వివరాలతో తెలుగు వర్ణమాలను అనుసరించి వరుసలో కేటాయిస్తారు.

మరిన్ని వార్తలు