ఈటల.. ఒంటరిగానే..!..పావులు కదుపుతోన్న టీఆర్‌ఎస్‌ !

1 Jun, 2021 04:53 IST|Sakshi

రాజేందర్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అప్రమత్తం 

హుజూరాబాద్‌ నేతలు పార్టీతోనే..

సాక్షి, హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిసిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అప్రమత్తమైంది. బీజేపీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌తో భేటీతో రాజేందర్‌ పార్టీని వీడటం దాదాపు ఖాయమవడంతో నేతలెవ రూ ఆయన వెంట వెళ్లకుండా ఇప్పటికే జాగ్రత్త లు తీసుకుంది. తాజా పరిణామాల నేపథ్యం లో ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సుమారు 90 శాతం పార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ వెంటే ఉం టామని ప్రకటించారు.

ప్రస్తుత పరిణామాల్లో హుజూరాబాద్‌ నేతలతోపాటు, రాష్ట్రస్థాయిలో అసంతృప్త నేతలెవరైనా ఆయన వెంట నడిచే అవకాశముందా అనే కోణంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం సమాచారాన్ని సేకరిస్తోంది. ఈటల వెంట ఢిల్లీకి వెళ్లినవారిలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఒక్కరే ఉండటం గమనార్హం. ఈటల బీజేపీలో చేరినా ఆయన వెంట పార్టీ ప్రధాన నేతలెవరూ లేకుం డా చూడాలనే వ్యూహంతో టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. మరోవైపు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సంస్థాగతంగా బీజేపీకి అంతగా బలంగా లేకున్నా ఆ పార్టీకి ఉన్న ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 

పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా? 
బీజేపీ అగ్ర నాయకత్వంతో ఈటల భేటీ అవడం, ఆ పార్టీలో చేరికపై విధివిధానాలు ఖరారు చేసుకుంటుండటంతో ఆయన పట్ల అనుసరిం చాల్సిన వ్యూహానికి టీఆర్‌ఎస్‌ పదును పెడు తోంది. ఈటలను  పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమా లేక రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పట్ల అనురిస్తున్న వైఖరినే ప్రదర్శించాలా అనే కోణంలో సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు తెలి సింది. ఇప్పటికే హుజూరాబాద్‌ నేతలతో పార్టీ ఇన్‌చార్జీల భేటీలు ముమ్మరం కాగా, నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత దొంతు రమేశ్‌ సోమవారం కేసీఆర్‌ను కలిశారు. బీజేపీలో ఈటల చేరిక ఖరారైన తర్వాతే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై టీఆర్‌ఎస్‌ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.   


 

మరిన్ని వార్తలు