Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

3 Dec, 2022 10:16 IST|Sakshi

1. Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. CM Jagan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్‌
ఎదుటి వారి కష్టం వినాలే కానీ, వెంటనే స్పందించడంలో తన తర్వాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్‌రెడ్డి దంపతుల మూడున్నరేళ్ల కుమారుడు యుగంధర్‌రెడ్డికి లివర్‌ దెబ్బతింది. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. టీడీపీ అంతర్గత సర్వే ఏం చెబుతోంది?.. షాక్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా
ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లా పార్టీలో తిరుగులేదనుకున్న దేవినేని ఉమాకు, గన్నవరం ఇన్‌చార్జిగా ఇటీవల వెళ్లిన బచ్చుల అర్జునుడుకు పార్టీ తమ్ముళ్లు షాక్‌ ఇచ్చారు. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు?
రాష్ట్రంలో మరిన్ని ప్రభు త్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసు, గ్రూప్స్‌ కొలువులకు నోటిఫికేషన్లు జారీకాగా.. తాజాగా గురుకులాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ
‘‘ఆటంక్, లట్‌కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్‌ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారయత్నం
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్‌ విద్యార్థినిపై ఫ్రొఫెసర్‌ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనలో తప్పించుకున్న బాధితురాలు.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. International Disability Day: నిశ్శబ్ద విజయం
పూర్తిగా వినపడకపోతే ఏమవుతుందో తెలుసా?’ అని అడుగుతుంది సోను ఆనంద్‌ శర్మ.
పూర్తిగా వినపడని వారు దానికి పూర్తి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా వినపడని వారికే ఆ బాధ తీవ్రత తెలుస్తుంది. ‘వినడం వల్లే భాష మాట్లాడతాం. వాక్యాన్ని నిర్మిస్తాం. గ్రామర్‌ నేర్చుకుంటాం. పూర్తి వాక్యం రాస్తాం. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. సొంత ఇల్లు కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..!
ప్రస్తుతం శివారు ప్రాంతాలలో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి... ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్‌ ప్లాట్, అపార్ట్‌మెంట్, విల్లా ఏ ప్రాజెక్ట్‌ చేయాలని బిల్డర్‌ నిర్ణయించుకుంటాడు. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. బంగ్లాదేశ్‌తో తొలి వన్డే.. టీమిండియాకు బిగ్‌ షాక్‌! స్టార్‌ ఆటగాడు దూరం
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియా భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. భారత వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో భాగంగా మహ్మద్ షమీ చేతికి గాయమైనట్లు బీసీసీఐ ఆధికారి ఒకరు తెలిపారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. లేట్‌ అయినా లేటెస్ట్‌గా వస్తామంటున్న స్టార్‌ హీరోలు
అభిమాన హీరో సినిమా విడుదల కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ చెప్పిన తేదీకి ఆ సినిమా రాకపోతే నిరుత్సాహపడతారు. 2022లో అలా అభిమానులను నిరాశపరచిన స్టార్స్‌ ఉన్నారు. ఈ ఏడాది సిల్కర్‌ స్క్రీన్‌పై కనిపించాల్సిన ఆ హీరోల సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు