ప‌వార్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం

18 Aug, 2020 10:38 IST|Sakshi

ముంబై: నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం చెల‌రేగింది. ముంబైలోని ఆయ‌న నివాసం సిల్వ‌ర్ ఓక్‌లో ప‌ని చేసే 12 మంది సిబ్బందికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో ఆయ‌న బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రిలో కోవిడ్‌ ప‌రీక్ష‌లు చేయించుకోగా నెగెటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్లు సోమ‌వారం మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్ల‌డించారు. ప‌వార్‌ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. అయితే ముందుజాగ్ర‌త్త‌గా ప‌వార్‌ నాలుగు రోజుల‌పాటు క్వారంటైన్‌లో ఉండ‌నున్నారు. మ‌రోవైపు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు జ‌రిపిన ప‌రీక్ష‌ల్లోనూ నెగెటివ్ అనే వ‌చ్చింది. కాగా ప‌వార్‌ నివాసంలో క‌రోనా బారిన ప‌డ్డ వారిలో 10 మంది భ‌ద్ర‌తా సిబ్బంది, ఇద్ద‌రు డ్రైవ‌ర్లు ఉన్నారు. వీరికి ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం వీరంద‌రూ వ‌ర్లిలోని ఎన్ఎస్‌సీఐ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. (మందిర నిర్మాణంపై పవార్‌ కీలక వ్యాఖ్యలు)

చ‌ద‌వండి: హాట్‌స్పాట్లు @ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు