English

2023 గద్వాల ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

28 Nov, 2023 13:31 IST|Sakshi

2023లో పోటీ చేస్తున్న అభ్యర్థులు: 

సరితా తిరుపతయ్య (కాంగ్రెస్),బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (బీఆర్ఎస్),బోయ శివ (బీజేపీ)

ఉద‌యం 9గం వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ శాతం: 10%

గద్వాల నియోజకవర్గం

జిల్లా: జోగులంబ గద్వాల్‌
లోక్‌సభ పరిధి: నాగర్‌కర్నూల్‌
రాష్ట్రం: తెలంగాణ
మొత్తం ఓటర్ల సంఖ్య: 253,903
పురుషులు: 124,763
మహిళలు: 129,096

ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి:

గద్వాల్
మల్దకల్
ఘాటు
ధరూర్
కాలూరు తిమ్మనదొడ్డి

చదవండి: 2023 కొడంగల్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

2023లో పోటీ చేస్తున్న అభ్యర్థులు 

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (బీఆర్ఎస్)
బోయ శివ (బీజేపీ)
సరితా తిరుపతయ్య (కాంగ్రెస్)

నియోజకవర్గం ముఖచిత్రం

జిల్లా కేంద్రమైన గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. గద్వాల నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌, కాంగ్రెస్‌(ఐ)లు కలసి ఏడు సార్లు విజయకేతనం ఏగురవేశాయి. రెండుసార్లు టీడీపీ గెలవగా, చెరొకసారి సీపీఎం, సమాజ్‌వాద్‌ పార్టీ గెలుపొందాయి. కోర్టు తీర్పు కారణంగా గెలుపు ఒకసారి కాంగ్రెస్‌ వశం ఆయ్యింది.
గద్వాలలో డీకే కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు జరిగిన 14 ఎన్నికల్లో తొమ్మిది సార్లు ఈ కుటుంబానికి చెందిన వ్యక్తులే గెలుపొందారు. ఇక్కడి నుంచి గెలిచిన డీకే సమరసింహా రెడ్డి, మాజీ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన డీకే అరుణ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. తర్వాతి సీఎంలు రోశయ్య కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినేట్‌లోనూ కొనసాగారు.

2018లో

గద్వాల నియోజకవర్గంలో  టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి డి.కె.అరుణపై 28260 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గద్వాలలో గట్టి నేతగా పేరున్న అరుణ 2018లో  తనకు మేనల్లుడు అయ్యే కృష్ణమోహన్‌ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల తర్వాత అరుణ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి బారతీయ జనతా పార్టీలో చేరడం విశేషం. కృష్ణమోహన్‌ రెడ్డికి 100415 ఓట్లు రాగా అరుణకు 72155 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇక్కడ ఎస్‌.ఎప్‌.బి తరపున పోటీచేసిన అబ్దుల్‌ మొహిన్‌ ఖాన్‌ ఏడువేల ఓట్లకు పైగా తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు.
కృష్ణమోహన్‌ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి రాజకీయ కుటుంబానికి చెందిన డి.కె.అరుణ మూడుసార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికయ్యాక డాక్టర్‌.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవిని పొందారు. తదుపరి రోశయ్య, కిరణ్‌ల మంత్రివర్గాలలో కొనసాగారు. 2014లో ఆమె తన మేనల్లుడు టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి అయిన కృష్ణమోహన్‌రెడ్డిపై 8260 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. గద్వాలలో పదిహేను సార్లు రెడ్డి సామాజిక వర్గం ఎన్నికైంది. ఒకసారి మాత్రం బిసి (బోయ) ఎన్నికయ్యారు.

గద్వాల నియోజకవర్గంలో  కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి రెండుసార్లు గెలిచినా, కోర్టు తీర్పు కారణంగా ఒకసారి కాంగ్రెస్‌ ఐ వశం అయింది. ఒకసారి టిఆర్‌ఎస్‌, ఒకసారి జనతా, ఒకసారి సమాజ్‌వాది పార్టీ అభ్యర్ధి గెలుపొందారు. మూడుసార్లు ఇండి పెండెంట్లు గెలిచారు. డి.కె. అరుణ 2004లో కాంగ్రెస్‌ ఐ  టిక్కెట్‌ రాకపోవడంతో  సమాజవాది పక్షాన పోటీచేసి గెలుపొంది కాంగ్రెస్‌ ఐ అనుబంధ సభ్యులయ్యారు. గద్వాలలో డి.కె. కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది.

ఈ కుటుంబానికి చెందిన సత్యారెడ్డి రెండుసార్లు, ఈయన పెద్ద కుమారుడు డి.కె.సమరసింహారెడ్డి నాలుగుసార్లు, రెండో కుమారుడు భరతసింహారెడ్డి ఒకసారి, భరతసింహారెడ్డి భార్య అరుణ మూడుసార్లు గెలుపొందారు. అంటే మొత్తం తొమ్మిది సార్లు ఈ కుటుంబీకులే గెలుపొందారు. అయితే 1994లో అన్నదమ్ములిద్దరూ పోటీపడితే టిడిపి మద్దతుతో ఇండిపెండెంటుగా ఉన్న భరత్‌ సింహారెడ్డి  గెలవగా, 1999లో బావా మరదళ్ళు పోటీపడి ఇద్దరూ పరాజితులయ్యారు. ఒకసారి టిడిపి అభ్యర్ధి గట్టు భీముడు గెలుపొందారు. 2004,2009లో అరుణ గెలుపొందారు.

2009లో డి.కె. అరుణ, ఆమెకు మేనల్లుడు అయ్యే టిడిపి  పక్షాన కృష్ణమోహన్‌రెడ్డి పోటీపడటం విశేషం. 2014లో ఆయన టిఆర్‌ఎస్‌లోకి మారారు కాని ఫలితం దక్కలేదు. 2018లో గెలవగలిగారు. 1985లో టిడిపి అభ్యర్ధిగా గెలిచిన గోపాల్‌రెడ్డి ఎన్నిక చెల్లదని, సమరసింహారెడ్డి ఎన్నికైనట్లు కోర్టు ప్రకటించింది. డి.కె. సమరసింహారెడ్డి గతంలో చెన్నా, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. ఇక్కడ ఒకసారి గెలిచిన పి.పుల్లారెడ్డి అలంపూర్‌లో రెండుసార్లు గెలుపొందారు. కాగా మాజీమంత్రి డి.కె. సమరసింహారెడ్డి తెలుగుదేశంలో చేరడం విశేషం. కాని2004లో  ఇక్కడ బిజెపి మిత్రపక్షం పోటీచేయడంతో ఆయనకు అవకాశం రాలేదు.దాంతో ఆయన ఆ పార్టీని వదలివేశారు.

చదవండి:  2023 జ‌డ్చ‌ర్ల ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

మరిన్ని వార్తలు