Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

24 Nov, 2022 10:25 IST|Sakshi

1. వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. 

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్‌ నోటీసులు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని ఎంపీ రఘురామ అన్నట్లు సమాచారం.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది?
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. 

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే?
మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు లభించాయి.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. 2 నెలల్లో 1.25 లక్షల తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం?
క్రికెట్‌ మ్యాచ్‌లో వెంట వెంటనే వికెట్లు పడిపోతుంటే అభిమానుల గుండె బరువెక్కిపోతుంది తప్ప ఇతరత్రా కష్టనష్టాలు ఉండవు. అదే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు టపటప ఊడిపోతుంటే.. కుటుంబాలు కుటుంబాలు కష్టాలపాలవుతాయి. ఆ కుటుంబాల మీద ఆధారపడ్డ చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. 

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఆల్‌ ఉమెన్‌ టీమ్‌ ఆకాశమే హద్దు
మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్‌–ఉమెన్‌ కార్‌ షోరూమ్‌’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్‌ నుంచి జనరల్‌ మేనేజర్‌ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్‌... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య 
ఇద్దరూ పెద్ద కంపెనీల్లో టెక్కీలు, కావలసినంత జీతం వస్తుంది, విలాసవంతమైన జీవితం ముందుంది. కానీ భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తి నగర రిచర్డ్‌ గార్డెన్‌లో ఈ నెల 10వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Satyam Scam:హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ సంచలన వ్యాఖ్యలు
సత్యం స్కామ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్‌ పుస్తకాలను ఆడిట్‌ చేసిన చార్టర్డ్‌ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌! స్టార్‌ ఆటగాడు దూరం
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బంగ్లాతో వన్డే సిరీస్‌తో పాటు టెస్టులకు కూడా దూరమయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మోకాలి గాయం బారిన పడిన జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Kamal Haasan: కమల్ హాసన్‌కు అస్వస్థత
స్టార్‌ హీరో కమల్‌హాసన్‌ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంలో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్‌ రామచంద్ర హాస్పిటల్‌లో ఆయనను చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, డిశ్చార్‌ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు