Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

30 Nov, 2022 10:14 IST|Sakshi

1. నేడు జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం విడుదల చేయనున్నారు.

👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: టీచర్లు.. టీచింగ్‌కే
విద్యారంగ సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల సమగ్ర పురోభివృద్ధికి వీలుగా ప్రభుత్వ టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని నిర్ణయించింది. 

👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఎదురుదాడికి టీఆర్‌ఎస్‌ స్పెషల్ స్ట్రాటజీ
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీపై సాగుతున్న ప్రతికూల ప్రచారానికి పకడ్బందీగా అడ్డుకట్ట వేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ సోషల్‌ మీడియా విభాగం బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు?
మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు మంగళవారం రెండోరోజు కూడా విచారణ కొనసాగించారు. మల్లారెడ్డి ఆడిటర్‌తోపాటు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. 

👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అందరి చూపు సుప్రీం వైపు.. సరిహద్దుల్లో భారీగా బలగాలు
కర్ణాటక–సరిహద్దు వివాదంపై బుధవారం సుప్రీంకోర్టులో అతి ముఖ్యమైన విచారణ జరగనుండగా, అందరి చూపు సర్వోన్నత న్యాయస్థానంపై కేంద్రీకృతమైంది. తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ సర్కారుతో పాటు ప్రజల్లోనూ నెలకొంది.

👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. గుజరాత్‌ ఎన్నికలు: కాంగ్రెస్‌ను ఊడ్చేస్తుందా?
గుజరాత్‌లో అధికార పీఠం కోసం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎడాపెడా హామీలతో ప్రచార పర్వాన్ని ఇప్పటికే రక్తి కట్టించాయి. రేపు తొలి దశకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్‌ 5న రెండో, తుది దశ పోలింగ్‌తో అన్ని పార్టీల భవితవ్యమూ ఈవీఎంల్లోకి చేరనుంది.

👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. యూనివర్సిటీలు ఖాళీ
చైనాలో ‘జీరో కోవిడ్‌’ నిబంధనలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిరసనలు, ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులను వారి ఇళ్లకు బలవంతంగా పంపిచేస్తుండడం గమనార్హం.

👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. యాకమ్మ ఒక గొప్ప వెలుగు
తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్‌ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని.
ఇంటర్‌లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్‌డి చేసింది.

👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మీరిద్దరు ఏం చేశారు? అది ఎటాక్‌లా లేదే.. దొరికిపోయావ్‌ శ్రీహాన్‌!
బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ముగింపు దశకు వచ్చింది. 13వ వారంలో హౌస్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం  ‘టికెట్‌ టు ఫినాలే’ టాస్క్‌ని  పెట్టాడు బిగ్‌బాస్‌. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు

👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. బీసీసీఐ అధ్యక్షుడిపై ఆరోపణలు.. ఆమె కారణంగా..! 
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘానికి చెందిన సంజీవ్‌ గుప్తా ఈ విషయంపై బీసీసీఐ ఎథిక్స్‌ ఆఫీసర్‌ వినీత్‌ శరణ్‌కు ఫిర్యాదు చేశారు. 

👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు