ప్చ్‌ టీడీపీ.. మొత్తానికి చేతులెత్తేసిన చంద్రబాబు!

13 Feb, 2024 08:58 IST|Sakshi

ఢిల్లీ, సాక్షి: నిన్నటిదాకా పోటీకి సై అంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. ఆఖరికి చేతులెత్తేశారు. వైఎస్సార్‌సీపీలో టికెట్లు దక్కని వాళ్లపై ఆశలు పెట్టుకుంటే.. అవి కాస్త గల్లంతయ్యాయి. సంక్షేమ సారథి జగనన్న వెంటే ఉంటామని వాళ్లు తేల్చుకోవడంతో టీడీపీ అధినేతకు నిరాశే ఎదురైంది. ఫలితంగా.. 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభ స్థానం గల్లంతు కాబోతోంది.  

రాజ్యసభలో టీడీపీని మట్టికరిపించేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. సంఖ్యాబలం చూసుకుంటే.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్సార్‌సీపీ ఏకపక్షంగా మూడింటికి మూడు దక్కించుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.  ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు రిటైర్‌ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. నామినేషన్ల దాఖలు గడువుకు మరో రెండు రోజులే మిగిలి ఉంది.

రాజ్యసభలో పోటీకి.. ప్రాతినిధ్యానికి 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీడీపీకి ఇప్పుడు 18 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అంటే మరో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం పడుతుంది. వైఎస్సార్‌సీపీలో మార్పులు-చేర్పుల కారణంగా టికెట్‌ దక్కనివాళ్ల మీద చంద్రబాబు గంపెడు ఆశలు పెట్టున్నారు. కుట్రలు, కుతంత్రాలకు తెర తీశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్‌ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అనంతలో చంద్రబాబుపై టీడీపీ నేతల ఫైర్‌

ఇలా .. ఎలా చూసుకున్నా రాజ్యసభ పోటీలో టీడీపీ గట్టెక్కడం అసాధ్యం. అందుకే పోటీ చేసే బలం లేక బరిలోకి దిగకూడదని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఈ పరిణామం ప్రతికూలం కానుంది.  మరోవైపు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే మూడు రాజ్యసభ సీట్లు పడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు నామినేషన్లు దాఖలు చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు