Aaditya Thackeray: మరాఠా రాజకీయాల్లో యువతార

13 Jun, 2022 15:39 IST|Sakshi

మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన వంశం వారిది. అయినా మూడో తరం వరకు ప్రత్యక్షంగా పోటీ చేసిన దాఖలాలు లేవు. తాత స్థాపించిన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచి అరుదైన రికార్డు లిఖించిన ఘనత శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే సొంతం. 

శివసేన పార్టీ యూత్‌ ఐకాన్‌గా వర్తమాన రాజకీయాల్లో వెలిగిపోతున్న 32 ఏళ్ల ఆదిత్య ఠాక్రే.. తన తండ్రి కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతుండడం విశేషం. మహారాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. సోమవారం (జూన్‌ 13) ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.


జననం:
జూన్‌ 13, 1990 (బుధవారం)
పుట్టిన ఊరు: ముంబై
తల్లిదండ్రులు: ఉద్ధవ్‌, రష్మీ ఠాక్రే
తమ్ముడు: తేజస్‌ ఠాక్రే (వన్యప్రాణుల పరిశోధకుడు)
పూర్తి పేరు: ఆదిత్య రష్మీ ఉద్ధవ్‌ ఠాక్రే
పాఠశాల విద్య: బాంబే స్కాటిష్‌ స్కూల్‌, ముంబై
ఉన్నత విద్య: సెయింట్‌ జేవియర్‌ కాలేజీ నుంచి బీఏ
న్యాయ విద్య: కేజీ లా కాలేజీ నుంచి న్యాయ పట్టా
ఆహారపు అలవాటు: నాన్‌వెజిటేరియన్‌
వ్యక్తిగత వివరాలు: ఇంకా పెళ్లి కాలేదు
హాబీస్‌: కవితలు చదవడం.. రాయడం, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం
ఆస్తుల విలువ: 16.05 కోట్లు (2019 ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం)


పొలిటికల్‌ జర్నీ: 

► 2010లో రాజకీయ అరంగ్రేటం, శివసేన పార్టీలో చేరిక

► జూన్‌ 17, 2010లో శివసేన యూత్‌ విభాగం ‘యువ సేన’ స్థాపన

► యువసేన అధ్యక్షుడిగా తాత బాల్‌ ఠాక్రే చేతుల మీదుగా నియామకం

► రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, బిహార్‌, జమ్మూకశ్మీర్‌లకు యువసేన విస్తరణ

► 2018లో శివసేన జాతీయ కార్యవర్గ కమిటీలో స్థానం

► 2019 అక్టోబర్‌లో ముంబైలోని వర్లీ స్థానం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ

► 67,427 మెజారిటీతో ఎమ్మెల్యేగా ఘన విజయం

► డిసెంబర్‌ 30, 2019లో మహారాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం

► మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వంలో యువ మంత్రిగా గుర్తింపు

► మహారాష్ట్ర పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణ


వివాదాలు:

► రోహింటన్‌ మిస్త్రీ పుస్తకాన్ని ముంబై యూనివర్సిటీ సిలబస్‌ నుంచి తొలగించాలని 2010, అక్టోబర్‌లో ఆందోళన

► సుధీంద్ర కులకర్ణిపై 2015, అక్టోబర్‌ 12న శివసేన సిరా దాడి, సమర్థించిన ఆదిత్య ఠాక్రే

► 2014 మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా గుజరాతీలు, మరాఠేతరులపై  ‘సామ్నా’లో వివాదాస్పద వ్యాఖ్యలు, క్షమాపణ


మరికొన్ని:

► శివసేన యూత్‌ విభాగం యువసేన అధ్యక్షుడిగా ఇప్పటికీ  కొనసాగుతున్నారు

► ‘మై థాట్స్‌ ఇన్‌ వైట్‌ అండ్‌ బ్లాక్‌’ పేరుతో 2007లో తన కవిత సంపుటి ప్రచురణ

► స్వంతంగా పాటలు రాసి 2008లో ప్రైవేట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ రూపకల్పన

► బాల్‌ ఠాక్రే సమక్షంలో అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా మ్యూజిక్‌ ఆల్బమ్‌ విడుదల

► 2017లో ముంబై జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక

చదవండి: ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది

మరిన్ని వార్తలు