యువతకు గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే..

21 Sep, 2021 14:35 IST|Sakshi

ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీలు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వరాలు

సాక్షి, న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రానున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్నేసింది. అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వ్యూహాలు సిద్ధం చేసింది. పంజాబ్‌తోపాటు గోవాపైన అరవింద్‌ కేజ్రీవాల్‌ దృష్టి సారించారు. పార్టీని అధికార, ప్రతిపక్షాల కన్నా బలంగా తయారుచేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో గోవా ఎన్నికల సందర్భంగా ఇప్పుడే హామీల వర్షం కురిపిస్తున్నాయి. అందులో భాగంగా 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని మంగళవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.
చదవండి: సజ్జనార్‌ సారూ మీరు సూపర్‌..

‘గోవా యువతకు నా 7 హామీలు’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. వాటిలో

  • ఎమ్మెల్యే సంబంధికులకు కాదు గోవావాసులకు ఉద్యోగాలు
  • కుటుంబానికో ఉద్యోగం
  • ఉద్యోగం వచ్చేంత వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
  • ప్రైవేటు ఉద్యోగాల్లో 80 శాతం గోవావాసులకే
  • కరోనాతో నిరుద్యోగులైన పర్యాటక శాఖకు చెందినవారికి రూ.5 వేల ఆర్థిక సహాయం
  • మైనింగ్‌ తవ్వకాల నిషేధంతో ప్రభావితులైన వారికి రూ.5 వేల ఆర్థిక సహాయం
  • స్కిల్‌ యూనివర్సిటీ

యువతకు ఉద్యోగ, ఉపాధిని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాన హామీగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ త్వరలో పర్యటించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీలో పాలన మాదిరి గోవాలో కూడా సాగిస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ చెబుతోంది. ఢిల్లీ పాలనను గోవాలో పునరావృతం చేస్తామని పేర్కొంటోంది. 40 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాలతో కలిసి ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. 
 

మరిన్ని వార్తలు