ఆర్‌పీఐ(ఏ)లో చేరిన పాయల్‌ ఘోష్‌

26 Oct, 2020 16:04 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవలే)లో చేరారు. కేంద్ర మంత్రి, ఆ పార్టీ చీఫ్‌ రాందాస్‌ అథవలే సమక్షంలో ఆమె ఆర్‌పీఐ(ఏ)లో అడుగుపెట్టారు. పార్టీలో ఆమె చేరికను తాను స్వాగతిస్తున్నానని, పాయల్‌ ఘోష్‌కు శుభాకాంక్షలు తెలియచేశానని రాందాస్‌ అథవలే పేర్కొన్నారు. ఆర్‌పీఐ(ఏ) మహిళా విభాగానికి ఆమెను ఉపాధ్యక్షురాలిగా నియమించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాయల్‌ ఘోష్‌ ఆర్‌పీఐలో చేరారు. బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కాశ్యప్‌పై పాయల్‌ చేసిన లైంగిక వేధింపుల ఆరోఫణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.  చదవండి : కంగనాకు మద్దతుగా నిలిచిన కేం‍ద్రమంత్రి

మరిన్ని వార్తలు