మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్‌

5 Jul, 2023 12:37 IST|Sakshi

అంబాజీపేట(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అంద­జేయడంతో మరోసారి వైఎస్సార్‌ సీపీ ప్రభు­త్వం ఏర్పడుతుందని సినీనటుడు సుమన్‌ చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రజలు, తమ అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరోసారి వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తీసుకొచ్చి వైఎస్‌ జగన్‌ని ముఖ్యమంత్రి చేయనున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోలేదని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే సముచిత న్యాయం జరి­గిందని వారే చెబు­తున్నారని తెలిపారు. నవ­రత్న పథకాలను 95 శాతం అమలు చేసి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలి­చార­న్నారు.
చదవండి: అసలేం జరిగింది? మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా?  

మరిన్ని వార్తలు