ఆలోచించి మాట్లాడండి.. మర్రి శశిధర్‌ రెడ్డికి అద్దంకి దయాకర్‌ సూచన

18 Aug, 2022 09:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో​ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, మర్రి శశిధర్‌ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అద్దంకి దయాకర్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. కాంగ్రెస్‌ పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము చేసిన కామెంట్స్ పెద్దదిగా చేయకుండా సద్దుమణిగే విధంగా ఉంటే బాగుండేది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలకు కాంగ్రెస్‌ పావుగా మారుతోంది. 

సీనియర్‌ నేతలు మాట్లాడితే కాదు అనే వారు ఎవరూ లేరు. అంతర్గత అంశాల మీద మీరే సలహాలు ఇవ్వాలి. కానీ, పీసీసీని ఇలా అంటే పార్టీకి నష్టం కదా?. ఏదైనా ఉంటే క్రమశిక్షణ కమిటీ ఉంది. ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ కూడా ఉంది. ఒక సీనియర్ నాయకుడిగా మీరు(మర్రి శశిధర్‌ రెడ్డి) ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నన్ను కూడా మీరు అన్నందుకు స్పందిస్తున్నాను. రేవంత్ చెప్తే నేను స్పందించడం లేదు’’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: మునుగోడులో గోల్ కొట్టేదెవరు..? కాంగ్రెస్,టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు...

మరిన్ని వార్తలు