టీడీపీ సినిమా ముగిసింది

25 Feb, 2021 05:24 IST|Sakshi

చంద్రబాబు కాలం అయిపోయింది

పురపాలక, పరిషత్‌ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీదే విజయం

మంత్రి ఆదిమూలపు సురేష్‌  

సాక్షి, అమరావతి: ‘‘టీడీపీ సినిమా ముగిసింది. చంద్రబాబు కాలం అయిపోయింది. ప్రజలు, టీడీపీ శ్రేణులు చంద్రబాబును నమ్మట్లేదు. సీఎం జగన్‌ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజలకేర్పడింది. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఇది ప్రతిబిం బించింది’’ అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో నెగ్గినట్లుగానే త్వర లో జరగనున్న పురపాలక, పరిషత్‌ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందన్నారు. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఎన్నికల్లో తన పార్టీ గెలిస్తే ప్రజల మద్దతు తమకే ఉన్నట్టు, వైఎస్సార్‌సీపీ గెలిస్తే అక్రమాలు జరిగినట్లు చెప్పడం చంద్రబాబు నైజ మని విమర్శించారు. అసలు ఎన్నికల్లో అక్ర మాల సృష్టికర్త చంద్రబా బేన న్నారు. మంత్రి సురేష్‌ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాల యం వద్ద మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యుత్తమ పాలన అంది స్తున్న సీఎంలలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్న వైఎస్‌ జగన్‌ పాలనకు పంచాయతీ ఎన్నికలు దర్పణం పట్టాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో దాదాపు తొంభైశాతం ఏడాదిన్నరలోనే నెరవేర్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.

అలా మాట్లాడడం బాబుకే చెల్లు..
కుట్రలు, కుతంత్రాలతో ఏదోరకంగా విజయం సాధించాలని ప్రయత్నించి టీడీపీ అధినేత చంద్ర బాబు చతికిలపడ్డారని ఆదిమూలపు విమర్శిం చారు. సొంత నియోజకవర్గం కుప్పంలో తనద్వారా లబ్ధి పొందినవారితో పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసినా అరకొర స్థానాలకే పరిమితమయ్యా రన్నారు. ‘‘మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్సార్‌సీపీని విమర్శించారు. రెండో విడత ఫలితాలు వెలువడగానే ఎన్నికల కమిషన్‌ను విమర్శించారు. ఇప్పుడు నాలుగో విడత ఫలితాలు వెలువడగానే యాభై శాతం మేమే గెలిచామంటూ చెప్పుకుంటున్నారు. ఒక్కో విడతలో ఒక్కోవిధంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లుతుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు మతి చెలించింది. టీడీపీ శ్రేణులు ఆ పార్టీని వీడటం ఖాయం’’ అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు