OPS Vs EPS: పన్నీర్‌సెల్వం డీఎంకేతో కుమ్మక్కు అయ్యాడు.. పళనిస్వామి సంచలన ఆరోపణలు

11 Jul, 2022 15:09 IST|Sakshi

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే బహిష్కరణ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. కోటిన్నర క్యాడర్‌ ఎన్నుకున్న తనను ఎలా తప్పిస్తారని? ఆ అధికారం ఒక్క పళనిస్వామికో, ఇతర నేతలకో అస్సలు లేదని వ్యాఖ్యానించారు. 

తన బహిష్కరణకు అసంబద్ధంగా పేర్కొన్న ఓపీఎస్‌.. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని, బహిష్కరణ నిర్ణయంపై చట్ట ప్రకారం కోర్టుకు వెళ్తానని ప్రకటించారు.  ఇదిలా ఉంటే.. ఓపీఎస్‌కు షాకిస్తూ పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది మద్రాస్‌ హైకోర్టు. దీంతో ప్రెసిడియమ్‌ చైర్మన్‌ తమిళ్‌మహాన్‌ హ్సుస్సేన్‌ అధ్యక్షతన వనగారమ్‌లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే ఇంటీరియమ్‌ జనరల్‌ సెక్రెటరీగా పళనిస్వామిని ఎన్నుకుంటూ.. అలాగే పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటించింది అన్నాడీఎంకే. 

డీఎంకేతో కుమ్మక్కయ్యాడు
అన్నాడీంకే జనరల్‌ సెక్రెటరీ(ఇంటీరియమ్‌) హోదాలో ఈ పళనిస్వామి.. పన్నీర్‌సెల్వంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. అధికార పక్షం డీఎంకేలో పన్నీర్‌సెల్వం కుమ్మక్కు అయ్యాడంటూ సంచలన ఆరోపణలే చేశారు ఓపీఎస్‌. ఓపీఎస్‌ హింసాకాండకు పాల్పడ్డాడు. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి పార్టీకి సంబంధించిన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఎన్నిసార్లు అభ్యర్థించినా.. పోలీస్‌ భద్రత కల్పించలేదు. శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇంత కన్నా నిదర్శనం ఇంకేంటి?. 

.. పార్టీకి ఒక్కరే నేత ఉండాలని సీనియర్లు చెప్పిన సూచనను సైతం ఓపీఎస్‌ పెడచెవినపెట్టాడు. నేను మీలో ఒక్కడినే(పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి..). ఈ పార్టీనే నా జీవితం. పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా.. పని చేశా. ఇద్దరి నాయకత్వంలో పని తీరు ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. 

డీఎంకేను అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్‌ ఒక దుష్టశక్తితో పోల్చారు. డీఎంకే ప్రభుత్వం అంటే.. కమీషన్లు, అవినీతికి కేరాఫ్‌. అలాంటి పార్టీ ప్రభుత్వంపై ఓపీఎస్‌ కొడుకు ఓపీ రవీంద్రన్‌ లోక్‌ సభ సభ్యుడిగా ఉండి మరీ.. ప్రశంసలు గుప్పిస్తున్నాడు. అలాగే ఓపీఎస్‌ ఒక్కడే పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించొద్దంటూ వాదించాడు.. కోర్టుకెక్కాడు అంటూ పళని స్వామి విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు