గాలిపటం ఆశలు ఆవిరి: అసదుద్దీన్‌కు నిరాశ

2 May, 2021 21:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తపరమైన పార్టీగా ముద్ర పడిన ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఈ-ఇతెహదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ తాజా ఎన్నికల్లో ఘోర ఫలితాల పొందింది. 30 శాతం ముస్లిం ఓటర్లు ఉండే పశ్చిమ బెంగాల్‌లో ఎంఐఎం పార్టీ ప్రధాన దృష్టి సారించింది. అయితే ఎంఐఎం పోటీపై పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంఐఎం తీరుపై విరుచుకుపడింది. 

బీజేపీ ఇచ్చే మూటల కోసం ఎంఐఎం పార్టీ పోటీ చేస్తోందని.. హైదరాబాద్‌ పార్టీకి బెంగాల్‌లో ఏం పని పశ్నిస్తూ ఇరుకున పెట్టింది. మత రాజకీయాలకు బెంగాల్‌లో చోటు లేదని మమతా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా ఎన్నార్సీ, సీఏఏ వంటి వాటిపై మమతా బెనర్జీ మొదటి నుంచి పోరాటం చేస్తోంది. ఈ సందర్భంగా ఆ ఓట్లన్నింటిని మమతా సొంతం చేసుకుంది. దీంతో ఎంఐఎం పార్టీకి ఘోర ఫలితాలు వచ్చాయి. దాదాపు పది లోపు స్థానాలు సొంతం చేసుకుంటామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఆశలు అడియాశలయ్యాయి. గాలిపటం ఎక్కడా ఎగరలేదు.

బీజేపీతో ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకుందనే ప్రచారం బలంగా వీచింది. ఆ వాదన బెంగాల్‌లో బలపడడంతో ముస్లింలంతా ఎంఐఎం పార్టీకి ఓట్లు వేయలేదు. తమ ఓట్లన్నీ మమతా పార్టీకి వేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఎన్నో ఆశలు పెట్టి బెంగాల్‌లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీని బెంగాల్‌ ప్రజలు తిరస్కరించారు. హైదరాబాద్‌ పార్టీగా ముద్రపడిన ఎంఐఎంను ఆదరించలేదు. కేవలం 0.02 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పడ్డాయి. అయితే ఎంఐఎం ఒక్క బెంగాల్‌ మినహా కేరళ, అసోం, తమిళనాడులో పోటీపై అంతగా ఆసక్తి కనబర్చలేదు. ఆ రాష్ట్రాల్లో పోటీ కూడా చేయలేదు.

చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?'
చదవండి: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం

మరిన్ని వార్తలు