యూపీ బరిలో ఒవైసీ అలజడి

27 Sep, 2021 05:07 IST|Sakshi

ముస్లిం నాయకత్వం అస్త్రం పని చేస్తుందా? 

ఓట్లను చీల్చడానికే పరిమితమవుతారా? 

ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లలో ఆందోళన

లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల అసెంబ్లీ కదనరంగంలోకి తొలిసారిగా దిగుతున్న అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పలు పారీ్టలకు సవాల్‌ విసురుతోంది. రాష్ట్రంలో ముస్లిం నాయకత్వం లేదని, దాని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమంటూ ఎన్నికల బరిలో దిగిన హైదరాబాద్‌ ఎంపీ ఒవైసీ ఎంత మేరకు ప్రభావం చూపిస్తారన్న చర్చ మొదలైంది. మజ్లిస్‌ పోటీ ఇన్నాళ్లూ మైనార్టీ ఓటు బ్యాంకుని నమ్ముకున్న పార్టీల్లో ఆందోళన రేపుతోంది.

రాష్ట్ర జనాభాలో 19 శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ సరైన నాయకులు లేని కొరత వారిని వెంటాడుతూనే ఉంది. యాదవులు, రాజ్‌బహర్లు, నిషాద్‌లు, జాటవులు వంటి తక్కువ జనాభా ఉన్న కులాలకు కూడా ఎంతో కొంత పేరు పొందిన నేతలు ఉన్నారు. ముస్లింలో ఆ నాయకత్వ లేమి సమస్యనే ఒవైసీ ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. సమాజ్‌వాది (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్‌ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల్లో నలిగిపోతున్న ముస్లింలను సంఘటితం చేసి నాయకుల్ని తయారు చేస్తానన్న ఒవైసీ మాటలు ఆ పారీ్టల గుండెల్లో తూటాలై పేలుతున్నాయి.

403 లోక్‌సభ స్థానాలున్న యూపీలో 82 స్థానాల్లో ముస్లింలు గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. గత ఏడాది జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచల్‌ ప్రాంతంలో అయిదు సీట్లు దక్కించుకొని ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ ఓట్లను ఎంఐఎం భారీగా చీలి్చంది. ఆ విజయం ఇచి్చన ధీమాతో యూపీలో 100 సీట్లలో భాగదారి మోర్చా కూటమితో చేతులు కలిపి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం సమర్థులైన నాయకుల్ని ఎదగనివ్వడమే తమ లక్ష్యమని ఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్‌ అసిమ్‌ వకార్‌ వెల్లడించారు. ఇన్నాళ్లూ ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచి్చన పారీ్టలేవీ ఆ వర్గానికి చెందిన నాయకుల్ని ఎదగనివ్వలేదని, సచార్‌ కమిటీ నివేదిక కూడా అదే చెబుతోందని ఆయన విమర్శించారు. మరోవైపు ఎస్పీ, బీఎస్పీలు ఒవైసీ అధికార బీజేపీ చెప్పినట్టుగా ఆడుతున్నారని, ఓట్లు చీల్చడానికి యూపీలో పోటీకి వచ్చారని ఆరోపిస్తున్నాయి. ఎస్పీ విజయావకాశాలను గండి కొట్టడానికే బీజేపీ అడుగులకి మడుగులొత్తుతూ ఒవైసీ నడుచుకుంటున్నారని సీనియర్‌ ఎస్పీ నేత అబూ అజ్మీ ఆరోపించారు.

సత్తా చాటగలరా?
అయోధ్యలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఒవైసీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ఒవైసీ తాను అనుకున్నది సాధిస్తారా లేదా అన్నదానిపై రాజకీయ పరిశీలకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిహార్‌లో గెలిచినంత సులభంగా యూపీ రాజకీయాల్లో ఒవైసీ నెగ్గలేరని, కానీ ఓట్లు భారీగా చీల్చి విజయావకాశాలను తారుమారు చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎస్పీ, బీఎస్పీ వంటి పారీ్టలు ముస్లిం ఓట్లతో నెగ్గినా వారి సమస్యలపై ఎప్పుడూ మౌనం వహిస్తున్నాయని, అందుకే ఒవైసీ ప్రభావం ఉంటుందని మరికొందరు అంటున్నారు. ‘‘ముస్లింలకు నాయకత్వం లేకపోతే వారిపై అరాచకాలు కొనసాగుతాయన్న భావన వారిలో మొదలైంది. ఎన్నికల నాటికి ఇది బలోపేతమై ఒవైసీకి కలిసొస్తుంది’’ అని రాజకీయ విశ్లేషకుడు పర్వేజ్‌ అహ్మద్‌ అన్నారు. యూపీలో ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముస్లింలలో నాయకత్వం అంశంపై చర్చ జరుగుతూనే ఉంటుందని...  అయినప్పటికీ వారు దానిని పెద్దగా పట్టించుకోకుండా ఎస్పీ, బీఎస్పీకి ఓటు వేస్తూ వచ్చారని ఎన్నికల విశ్లేషకుడు రషీద్‌ కిద్వాయ్‌ అన్నారు.  

► జనాభాలో ముస్లింల శాతం: 19.26%
► నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థానాలు: 82
► రామ్‌పూర్‌లో ముస్లిం జనాభా: 50.57%
► మొరాదాబాద్‌: 47.12%
n    బిజ్నార్‌: 43.04%
n   ► n    ముజఫర్‌నగర్‌: 41.3%
n    అమ్రోహ్‌: 40.78%
►     బలరామ్‌పూర్, అజమ్‌గఢ్, బరేలి, మీరట్, బహ్రెయిచ్, గోండా, శ్రావస్తిలలో: 30%పైగా

మరిన్ని వార్తలు