ప్రజలు అల్లాడుతుంటే పట్టదా? 

28 Jul, 2020 04:36 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కోదండరాం. చిత్రంలో చాడ, తమ్మినేని తదితరులు 

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అటు దేశం లో, ఇటు రాష్ట్రంలో కరోనా కోరల్లో చిక్కి ప్రజలు అల్లాడుతుంటే పాలకులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేశాయని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్‌.కృష్ణయ్య, తెలంగా ణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ విమర్శించారు. సోమవారం సుందరయ్య వి జ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిలపక్ష రౌండ్‌ టేబు ల్‌ సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణలో తీవ్రస్థాయిలో కోవిడ్‌ మరణాలు పెరి గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహా ర భద్రత, వైద్య సేవలు ప్రజలకు అందడం లేదన్నారు. 

30న కలెక్టరేట్ల వద్ద నిరసన 
ఇక ఈనెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల వేదిక (టీఎల్‌పీఎంఎఫ్‌) ద్వారా జిల్లాల కలెక్టరేట్లకు నల్ల జెండాలతో నిరసనగా వెళ్లి వినతి పత్రం అందజేస్తామని అఖిల పక్ష నేతలు తెలిపారు. కోవిడ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఆగస్టు 2న వర్చురల్‌ రచ్చబండ బహిరంగ సభ నిర్వహిస్తామన్నా రు.  జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు (ఆగస్టు 2 మినహా) ప్రతిరోజూ ఒక అంశంపై వెబినార్‌/సెమినార్లు ఉంటాయన్నారు.

రోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల దాకా ఈ కార్యక్రమాలుంటాయని వెల్లడించారు. జూలై 28న కోవిడ్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం–న్యాయపోరాటం, 29న అసంఘటిత రంగం, వలస కూలీలపై కోవిడ్‌ ప్రభావం, 30న కొరవడుతున్న ప్రజారోగ్యం, 31న విద్యారంగంపై కోవిడ్‌ ప్రభావం, ఆగస్టు 1న కోవిడ్‌ బాధితులు–సహాయక చర్య లు, 3న ఉద్ధీపన పథకాల డొల్లతనం, 4న కోవిడ్‌ ప్రజాందోళనపై ప్రభుత్వ నిర్బంధం, ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు, నల్ల జెండాలతో, నల్ల బెలూన్లు ఎగరేసి మహానిరసన తెలుపుతామని వివరించారు.

మరిన్ని వార్తలు