తెలుగు ప్రజలకు పట్టిన పీడ చంద్రబాబు నాయుడు: జోగి రమేష్‌

27 May, 2021 19:07 IST|Sakshi

సాక్షి, అమరావతి: వ్యవస్థలో ఉన్న తన వాళ్ళను ఉపయోగించుకుంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, సీఎంపై కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్  మండిపడ్డారు. గత రెండేళ్లలో ఆయనలో కొంచెం కూడా మార్పు రాలేదని, ఈ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్రలకు పూనేకుంటూనే ఉన్నారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు పట్టిన పీడని అన్నారు.

ఓటుకు నోటు కేసులో చం‍ద్రబాబు అడ్డంగా దొరకడంతో కట్టుబట్టలతో పారిపోయి వచ్చాడని, 2019లో ఘోరంగా ఓడిపోవడంతో మళ్లీ హైదరాబాద్ వెళ్ళాడని చెప్పుకొచ్చారు. ఓటుకు నోటులో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని ప్రజలకి తెలియదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై ఈడీ కేసుకు సంబంధించి చంద్రబాబు స్పందించాలని అన్నారు. బాబు నిర్వాకం వల్ల హైదరాబాద్ పై హక్కు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వస్తే హైదరాబాద్ పారిపోయి అక్కడ నుంచి రాళ్లు వేసి విషాన్నీ చిమ్ముతున్నాడని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల నుంచి తిరుపతి ఉప ఎన్నికల వరకు ఫ్యాన్ గుర్తుకే ప్రజలు ఓటు వేస్తున్నారని, ఎన్ని చేసినా ప్రజల ఆశీస్సులు మనసున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉంటాయని అన్నారు.

చదవండి: ఓటుకు నోటు కేసు: ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన ఈడీ

మరిన్ని వార్తలు