ఎన్నికల బహిష్కరణ తప్పుడు నిర్ణయం

4 Apr, 2021 04:31 IST|Sakshi
మల్లేశ్వరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న అంబటి

టీడీపీకి ధూళిపాళ్ల ఎంపీటీసీ అభ్యర్థి మల్లేశ్వరి రాజీనామా  

ఎమ్మెల్యే అంబటి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక 

సత్తెనపల్లి: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, మండల పరిషత్, జిల్లాపరిషత్, ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు. ఇందుకు నిరసనగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె.మల్లేశ్వరి ఆ పార్టీకి రాజీనామా చేసి శనివారం స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

వీరిని అంబటి రాంబాబు సాదరంగా ఆహా్వనించి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం ఎంపీటీసీ అభ్యర్థి మల్లేశ్వరి, ఆమె భర్త పిచ్చయ్య మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నామని, అక్కడ మోసాలు తప్ప మరొకటి లేదన్నారు. ఇకపై వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. అంబటి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పాలనలో ఎలాంటి వివక్షకూ తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అందుకే ప్రజలు ఆయనకు  బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఏ ఎన్నికలు జరిగినా ఏకపక్షంగా విజయాలు అందిస్తున్నారన్నారని చెప్పారు.  

మరిన్ని వార్తలు