'అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది'

15 Sep, 2020 15:44 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'అమరావతి పెద్ద స్కామ్‌ అని మేము ముందునుంచి చెప్తున్నాం. బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. త్వరలోనే ఈ భారీ కుంభకోణంలో ఆశ్చర్యకర విషయాలు బయటకి రాబోతున్నాయి. చట్టాలను, బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారు.  (టీడీపీ బాత్‌రూంలను కూడా వదల్లేదు: సోము వీర్రాజు)

ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ వెయ్యమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మీరు తప్పు చెయ్యకపోతే సీబీఐ వెయ్యమని కేంద్రాన్ని కోరండి. తప్పు చేశారు కనుకే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదు. ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీలకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలి. 24 గంటల్లో సీబీఐ విచారణ కోరకపోతే తప్పు చేసినట్టే. డీజీపీపై హైకోర్ట్ వ్యాఖ్యలు దురదృష్టకరం. న్యాయస్థానలపై మాకు గౌరవం ఉంది. హైకోర్టులో కామెంట్స్‌పై సమాధానం చెప్పలేము. ఆర్డర్‌పై మాత్రమే సమాధానం చెప్పగలం' అని అంబటి పేర్కొన్నారు. (రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు