తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి : అంబటి

26 Feb, 2021 17:19 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు భారీ ఎత్తున గెలిచినా, చంద్రబాబు మాత్రం తామే గెలిచామంటూ టపాసులు కాల్చాడం చాలా విడ్డూరంగా ఉందని రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..'టీడీపీ ఆవిర్భాం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది. కుప్పంలో టీడీపీ కేవలం 14 పంచాయతీలు మాత్రమే గెలిచారు. రాష్ట్రమంతా ఇలానే ఉన్నా చంద్రబాబు మాత్రం ప్రజస్వామ్యం ఓడిందంటున్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లని చంద్రబాబుని జగన్ కుప్పం రప్పించారు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు బజారు బజారు తిరుగుతున్నారు...ఇది జగన్మోహన్ రెడ్డి గొప్పదనం' అని అంబటి రాంబాబు అన్నారు. 

మున్సిపల్ ఎన్నికలు కూడా వదిలేసి చంద్రబాబు కుప్పంలో తిష్ట వేశారని, బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ బొమ్మలు పెట్టుకుని కుప్పంలో సైతం తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారానికి ​తీసుకెళ్లి, ఓడిన తర్వాత పక్కన పెట్టారని, చివరికి ఆయన సినిమాలు కూడా చూడవద్దని సూచించిన చంద్రబాబు..ఇప్పుడు ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. 'నేను పులివెందులకు నీళ్లిచ్చాను...ఇప్పుడు కుప్పానికి నీళ్లివ్వండి అంటాడు.నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశావ్...పులివెందులకు నువ్వు నీళ్లిచింది ఎప్పుడు..?' అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని తెలుగు తమ్ముళ్లు గుర్తించాలన్నారు. 

'పుంగనూరులో పోటీ చేస్తాను అని  అంటాడు... అంటే కుప్పాన్ని వదిలేసావా..? ఈ రోజు పచ్చకాగితాల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక్కటన్నా అమలు చేశావా?  అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయలేని నువ్వు అధికారంలో లేనప్పుడు ఎలా అమలు చేస్తావు? లోకేష్ ఏదేదో మాట్లాడుతున్నారు..ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. జగన్ గారి గన్లో బుల్లెట్స్ లేకపోతే నువ్వు మంగళగిరిలో ఒడిపోయావా? ఆయన గన్లో బుల్లెట్స్ లేకపోతే కుప్పంలో 14 పంచాయతీలకు పరిమితం అయ్యారా? భువనేశ్వరి గారికి సూచన చేస్తున్నా...మీ కుమారుడిని  ఎవరికైనా చూపించండి. లోకేష్ ముఖ్యమంత్రి కావడం సాధ్యమయ్యే పని కాదు అని మీరన్నా గుర్తించండి. నారా వారి కుటుంబానికి మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లోకేష్ బాబాయిని చూస్తే తెలుస్తోంది. అందరూ ముఖ్యమంత్రుల కుమారులు ముఖ్యమంత్రులు కాలేరు. ఐడెంటిటీ క్రైసిస్ వల్ల లోకేష్ పదవీ కాంక్షతో మాట్లాడుతున్నట్లున్నారు' అని పేర్కొన్నారు. జనసేనకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు, ఎదో మేము అప్పుడప్పుడు విమర్శిస్తున్నాం కాబట్టి జనసేన ఉన్నట్లు ప్రజలకి తెలుస్తోందని అంబటి అన్నారు. 

చదవండి : (చంద్రబాబూ.. నువ్వో చచ్చిన విషసర్పం)
(బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! )

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు