Konaseema Issue: పవన్‌ కల్యాణ్‌ తీరుని ఎండగట్టిన అంబటి.. ‘ప్రొసీజర్‌ తెలియకుండా ఏంటిది?’

25 May, 2022 19:36 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అమలాపురం అల్లర్ల ఘటనపై పవన్‌ కల్యాణ్‌ స్పందించిన తీరు దారుణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కల్యాణ్‌ పార్టీకి చెందిన వారు ఎందుకు నిరాహార దీక్షలు చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రజల నుంచి డిమాండ్ వచ్చినపుడు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అంబటి స్పష్టం చేశారు. మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు.
చదవండి👉 పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?

‘మీ డిమాండ్, ప్రజల డిమాండ్‌నీ ప్రభుత్వం అంగీకరించింది కదా. మేమే మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను దగ్దం చేసుకున్నామా? ఎక్కడా పవన్ ఇవాళ ఇది దురదృష్టకరం, ఖండిస్తున్నాం అన్న మాట అనలేదు. శ్రీలంక అవుతుంది అని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ అన్నారు. ఇప్పుడు శ్రీలంకలా చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. చివరికి మంటలను ఆర్పడానికి ఫైర్ ఇంజన్ రాకుండా అడ్డుకున్నారు. మంత్రి ఇంటిని తగలబెట్టి శ్రీలంకలా రాష్ట్రం మారింది అని చూపించాలి అనుకుంటున్నారు. అభ్యంతరాలు చెప్పడానికి 30 రోజులు ఎందుకు అంటాడు పవన్‌.. అది ప్రొసీజర్.

తుని సంఘటనను దీనికి ముడి పెడుతున్నారు. ఆరోజు కడప వాళ్లు అన్నారు. చంద్రబాబు మాటలే ఈయన నోటి నుంచి వస్తున్నాయి. మా విశ్వరూప్ ఇల్లు, మా సతీష్ ఇల్లు మేము తగలేసుకున్నామా? డైవర్షన్ అనడానికి పవన్ కల్యాణ్‌కు అసలు అవగాహన ఉందా? అసలు జరిగిన దాడులను ఖండించకుండా ఏదేదో ఎందుకు మాట్లాడతాడు. కోనసీమలో జరిగిన సంఘటనలో కఠినంగా వ్యవహరించాలి. ఉక్కుపాదంతో అణచివేయాలి... అలా పవన్ ఎందుకు డిమాండ్ చేయడు?’ అని పవన్‌ తీరుని మంత్రి అంబటి రాంబాబు ఎండగట్టారు.
చదవండి👇
చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నాడు: మంత్రి రోజా
అమలాపురం అల్లర్లపై స్పీకర్‌ సీరియస్‌.. అప్పుడుంటది బాదుడే బాదుడు!

మరిన్ని వార్తలు