‘దీదీ భయపడింది.. అందుకే ఆ నిర్ణయం’

11 Feb, 2021 15:50 IST|Sakshi

త్వరలోనే బెంగాల్‌లో దీదీ, ఆమె మేనల్లుడికి చెక్‌ పెడతాం

కోల్‌కతా: మరి కొద్ది రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ ఢీ అంటే ఢీ అన్నట్లు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడి రాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ కుచ్‌బిహార్‌లో ‘‘పరివర్తన్‌ యాత్ర’’ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్‌ షా బెంగాల్‌లో త్వరలోనే హింసా కాండను అంతం చేసి.. అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. బెంగాల్‌లో జై శ్రీ రామ్‌ అంటే నేరం చేసినట్లు చూస్తారేందుకు అని ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘‘బెంగాల్‌లో ప్రస్తు‍తం ఎలాంటి వాతావరణం ఉందంటే.. జై శ్రీ రామ్‌ అంటే ఇక్కడ నేరం చేసినట్లు భావిస్తారు. మమత దీదీని ఒక్కటే అడుగుతున్నాను.. జై శ్రీరాం నినాదాలు భారత్‌లో కాక పాక్‌లో ప్రతిధ్వనిస్తాయా’’ అని అమిత్‌ షా ప్రశ్నించారు.

దీదీ భయపడింది.. అందుకే రెండు చోట్ల పోటీ
‘‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ.. మమత, ఆమె మేనల్లుడి హింసా కాండకు చరమగీతం పాడనుంది. ప్రారంభంలో మాకు బెంగాల్‌లో గుడ్డి సున్నా వచ్చింది.. కానీ మేం భయపడలేదు.. పోరాడాం. ఇప్పుడు 18 స్థానాల్లో విజయం సాధించాం. ఈ సారి ఎన్నికల్లో దీదీకి సున్నా అనుభవం ఎదురుకానుంది. ప్రస్తుతం దీదీ చాలా భయపడుతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఓటమి భయంతో రెండు చోట్ల బరిలో నిల్చున్నారు’’ అని అమిత్‌ షా ఎద్దేవా చేశారు.

చదవండి: మమత మాత్రమే మిగులుతారు!
               ఇప్పుడు చెప్పండి..ఎవరు అగౌరపరిచారో : అమిత్‌ షా

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు