‘ప్రపంచం నుంచే కమ్యూనిస్టులు కనుమరుగు.. భవిష్యత్తు బీజేపీదే’.. అమిత్‌ షా ఆరోపణలు

3 Sep, 2022 19:05 IST|Sakshi

తిరువనంతపురం: భారతదేశం నుంచి కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు బీజేపీ పార్టీనేనని పేర్కొన్నారు. అలాగే.. ప్రపంచం నుంచే కమ్యూనిస్ట్‌ పార్టీలు కనుమరుగవుతున్నట్లు చెప్పారు. ‘భారత్‌ నుంచి కాంగ్రెస్‌ అంతరించిపోతోంది. అలాగే కమ్యూనిస్ట్‌ పార్టీ సైతం ప్రపంచం నుంచే కనుమరుగవుతోంది. కేరళలో ఒక్క బీజేపీ పార్టీకే భవిష్యత్తు.’ అని పేర్కొన్నారు అమిత్‌ షా.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు అమిత్‌ షా. వెనకబడిన తరగతులు, మైనారిటీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్ట్‌ పార్టీలు ఎప్పుడూ పని చేయలేదని విమర్శించారు. వారిని కేవలం ఓటు బ్యాంకులాగే చూశారని దుయ్యబట్టారు. దేశం కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సేవలను కాంగ్రెస్‌ విస్మరించిందన్నారు. అందుకే వారి పాలనలో భారతరత్న ఇవ్వలేదని ఆరోపించారు.

ఇదీ చదవండి: ‘అదే జరిగితే 2024లో పిక్చర్‌ వేరేలా ఉంటుంది’.. బీజేపీపై నితీశ్‌ విమర్శలు

మరిన్ని వార్తలు