హత్యా రాజకీయాలకు టీడీపీ పేటెంట్

31 Dec, 2020 05:26 IST|Sakshi

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా 

కడప అగ్రికల్చర్‌: హత్యా రాజకీయాలు చేయడంలో టీడీపీ పేటెంట్‌ పొందిందని డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా విమర్శించారు. బుధవారం కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ప్రొద్దుటూరుకు చెందిన నందం సుబ్బయ్య హత్యకు గురైతే.. చంద్రబాబు, లోకేశ్, ఎల్లో మీడియా కలిసి ప్రభుత్వం హత్య అనడం తగదన్నారు. ‘నందం సుబ్బయ్య టీడీపీ నాయకుడు కావచ్చు. కానీ.. అతనిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో 14 కేసులున్నాయి’ అని గుర్తు చేశారు. అదీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదైనవేనన్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో సుబ్బయ్య జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. అన్ని తెలిసి కూడా చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

వైఎస్‌ రాజారెడ్డి హత్య కేసులోని ముద్దాయిలను చంద్రబాబు తన ఇంట్లో ఉంచుకున్నది నిజం కాదా అని ప్రశి్నంచారు. అయినప్పటికీ మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ హంతకులను కూడా క్షమించి వదిలేశారన్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిజం ఉండకూడదని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలన్న లక్ష్యంతో ప్రాజెక్టులు నిర్మించి పనులు కలి్పంచాలని రాజశేఖరరెడ్డి కలలుగన్నారని తెలిపారు. ఆయన తనయుడు సీఎం జగన్‌ కూడా ప్యాక్షనిజం ఉండకూడదనే లక్ష్యంతో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓర్వలేక రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని ప్రభుత్వానికి, సీఎంకు అంటగట్టడం బాబుకు, లోకే‹Ùకు నిత్యకృత్యమై పోయిందన్నారు. 

మరిన్ని వార్తలు