ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బాబూ

25 Jul, 2020 04:23 IST|Sakshi

దళితులు ఎప్పటికీ పాకల్లో మగ్గాలన్నదే మీ ఉద్దేశం

అందుకే ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకున్నారు 

ఇంగ్లిష్‌ మీడియానికి కూడా అడ్డు తగిలారు 

కులాల మధ్య చిచ్చుపెట్టి నీచ రాజకీయం చేస్తున్నారు

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ ధ్వజం

సాక్షి, అమరావతి: దళితులకు మేలు చేయడమెలాగో అప్పట్లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నేర్చుకోవాల్సిందని.. కానీ అది జరగలేదని, కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సీఎం వైఎస్‌ జగన్‌ని చూసైనా నేర్చుకోవాలని రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసులో ఘటన జరిగిన 24 గంటల్లోనే దానికి బాధ్యులైన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశామన్నారు. అంతేకాకుండా అరెస్టు చేసి జైలుకు కూడా పంపామన్నారు. దేశంలో, చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే ఇంత వేగంగా స్పందించిన దాఖలాలే లేవన్నారు.

కులాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులు ఎప్పటికీ పాకల్లో మగ్గాలన్నదే ఆయన ఉద్దేశమని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వారు ఎక్కడ బాగుపడిపోతారో అని అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్‌ మీడియంను కూడా అందుకే అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆయన చేసే నీచ రాజకీయాలు ప్రపంచంలో మరెవరూ చేయరన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అమ్మాజీ మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఇంకా ఆమె ఏమన్నారంటే..

► కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి సంక్షేమ పాలన నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయాలన్నదే చంద్రబాబు ముఖ్య ఉద్దేశం. దళితులకు, దళితులకు, దళితులకు, ఓసీలకు మధ్య చిచ్చు పెడితే ఆయన చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతారు.
► దళితులకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 30 లక్షల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందిస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపింది.. చంద్రబాబే.
► చంద్రబాబు దళిత ద్రోహి అనేది దేశం మొత్తానికి తెలుసు. ఆయన ఒక ఫెయిల్యూర్‌ సీఎం. ఆయన 14 ఏళ్ల పరిపాలన గమనిస్తే ఇది అర్థమవుతుంది.
► దళిత ద్రోహి ఎవరు అని గూగుల్‌ని అడిగినా బాబు పేరే వస్తుంది. ఆయన మానసిక ఆరోగ్యంపై ప్రజలకు సందేహాలు ఉన్నాయి. టెస్టు చేయించుకున్నాకే ఆయన మీడియాతో మాట్లాడాలి.
► తన 40 ఏళ్ల ఇండస్ట్రీలో దాచుకోవడం.. దోచుకోవడం తప్పితే బాబు దళితులకు చేసింది ఏమీ లేదు. 
► దళిత సంక్షేమం విషయంలో ఏ ఒక్క అంశంలోనైనా సీఎం వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు సరితూగగలడా?
► బాబు వస్తే.. జాబు వస్తుందని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు కనిపించకుండా చేసిన ఘనుడు.. బాబు.  
► సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటే బాబుకు ఎందుకు కడుపు మంట? సీఎం ఏడాదిలోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. 
► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల పేద విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఉచితంగా చదువులు చెప్పిస్తుంటే బాబుకు ఎందుకు ఏడుపు?
► సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలనను దేశవిదేశాల్లోని ప్రజలు, మేధావులు మెచ్చుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి.
► హత్యా రాజకీయాలు చేయడం బాబుకు అలవాటు. పిల్లనిచ్చిన మామను అధికారం నుంచి దింపి ఆయన చావుకు కారణమయ్యారు.

>
మరిన్ని వార్తలు