‘టీడీపీ ఇప్పుడు తెలంగాణ దేశం పార్టీగా మారింది’

12 Jul, 2021 16:27 IST|Sakshi

తాడేపల్లి: చంద్రబాబు నాయుడుడి ఎప్పుడూ రెండుకళ్ల సిద్ధాంతమేనని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అని దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్‌ కుమార్‌.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు లేఖ రాయించారని, రాయలసీమ లిఫ్టును ఆపేయాలంటూ టీడీపీ డిమాండ్‌ చేస్తోందని మండిపడ్డారు.

టీడీపీ ఇప్పుడు తెలంగాణ దేశం పార్టీగా మారిందని, చంద్రబాబు హయాంలోనే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్‌లను కట్టిందని అనిల్‌ కుమార్‌ గుర్తుచేశారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు నోరెత్తడం లేదని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా చంద్రబాబు కేసులు వేశారని అన్నారు.

మరిన్ని వార్తలు