పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గదు

11 Mar, 2022 04:46 IST|Sakshi

శాసనసభలో మంత్రి అనిల్‌కుమార్‌

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం చేతకాని తనం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో ఒక్క పునరావాస కాలనీౖ నైనా నిర్మించారా? ఒక్క కుటుంబానికైనా పునరావాసం కల్పించారా? అని నిలదీశారు. పోలవరం డ్యామ్‌ ఎత్తు అంగుళం కూడా తగ్గించడం లేదని, కావాలంటే టేపు తెచ్చుకుని కొలుచుకోవచ్చునని సవాల్‌ విసిరారు. గురువారం శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ పోలవరం డ్యామ్‌ ఎత్తు తగ్గించే స్తున్నారనే అపోహలు రైతుల్లో నెలకొన్నాయని, నిర్మాణం ప్రశ్నార్థకంగా మా రిందన్నారు. దీనిపై మంత్రి  మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..‘2014 నాటికే 32 శాతం పూర్తయిన ప్రాజెక్టులో ఆ తర్వాత మూడేళ్లు తట్టెడు మట్టి కూ డా వేయలేదు.

2017 ఫిబ్రవరిలో 50 వేల ఇళ్లను తరలిస్తే సరిపోతుందని కేబినెట్‌ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఆ తర్వాత 90 వేలకు పెంచారు. అప్పుడే లక్ష ఇళ్లను తరలించాలని కేంద్రానికి నివే దించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. డ్యామ్‌ కట్టిన తర్వాత ఒకేసారి పూర్తిస్థాయి నీళ్లు నిలబెట్టరు. దానికో ప్రొటోకాల్‌ ఉంటుంది. ముందుగా మూడింట ఒక వంతు, ఆ తర్వాత 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లి 190 టీఎంసీల స్థాయి కి పెంచుతాం. ప్రస్తుతం 41వ కాంటూర్‌ వరకు పునరావాసం కల్పించాలనే ఆలోచనతోనే 17 వేల ఇళ్లను తరలించాలని నిర్ణయించాం. ఇప్పటికే 8 వేల ఇళ్లను తరలించడానికి సిద్ధం చేశాం’ అన్నారు. 

మరిన్ని వార్తలు