పోలవరంపై కుట్రలు

11 Jun, 2021 04:37 IST|Sakshi

ప్రాజెక్టు పూర్తయితే పుట్టగతులుండవని టీడీపీ బెంబేలు : మంత్రి అనిల్‌కుమార్‌

సాక్షి, అమరావతి: పోలవరాన్ని పూర్తిచేస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు వస్తుందనే ఆందోళనతో ఎలాగైనా ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన బృందం వ్యవహరిస్తోందని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. నిరీ్ణత సమయంలో పోలవరం పూర్తి అయితే తమకు పుట్టగతులుండవని టీడీపీకి భయం పట్టుకుందన్నారు. కోవిడ్‌ వల్ల ప్రపంచమంతా అన్ని కార్యకలాపాలు స్తంభించినా పోలవరం పనులు మాత్రం చకచకా కొనసాగుతున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్‌ సమయంలోనూ దాదాపు 3 వేల మందికిపైగా కార్మికులతో పోలవరం పనులను చేపడుతున్నామని తెలిపారు. ప్రాజెక్టు పనుల సందర్భంగా ముగ్గురు ఈఈలను, ఇద్దరు జేఈలను కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. పనులు వేగవంతంగా చేస్తున్న అధికారులు, కారి్మకులకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఖరీఫ్‌లో పోలవరం నుంచి నీళ్లిస్తామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మళ్లీ అసభ్యంగా మాట్లాడితే ఊరుకోం..
దిక్కు తోచని పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేశ్‌ పోలవరం పునరావాస ప్యాకేజీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ‘హెరిటేజ్‌ను అడ్డు పెట్టుకొని సహకార సంఘాలను నాశనం చేసింది మీరు కాదా? మరోసారి సీఎం గురించి అసభ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని లోకేశ్‌పై మండిపడ్డారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారంటూ విమర్శించిన ఓ వర్గం మీడియా ఇప్పుడు ఒక్క రోజు ఆలస్యమైతే ఇష్టానుసారంగా ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.

జూలైలోగా 10,400 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం
పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో ముంపునకు గురయ్యే 47 గ్రామాలకు చెందిన 10,400 కుటుంబాలకు జూలైలోగా పునరావాసం కల్పించాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి ముంపు గ్రామాల ప్రజల పునరావాసంపై సమీక్ష నిర్వహించారు. పశి్చమ గోదావరి జిల్లాలో పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 55 గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఇందులో 8 గ్రామాలకు చెందిన 2,109 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కలి్పంచామని మంత్రి అనిల్‌కుమార్‌ చెప్పారు. మిగిలిన 47 గ్రామాలకు చెందిన 10,400 నిర్వాసిత కుటుంబాల్లో 7805 కుటుంబాలకు 30 కాలనీల్లో ఇళ్లను నిరి్మస్తున్నామన్నారు. మిగతా 2,595 కుటుంబాలు సొంతంగా ఇళ్లు నిరి్మంచుకుంటున్నాయన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు