కాంగ్రెస్‌కు కలిసి రావట్లే.. అక్కడి నేతల మధ్య కుమ్ములాట.. రేవంత్‌కు కొత్త టెన్షన్‌

18 Aug, 2022 11:48 IST|Sakshi

సాక్షి, జడ్చర్ల: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో​ కాంగ్రెస్‌ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. తాజాగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి జిల్లాలో నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. జడ్చర్ల ఇంచార్జ్‌ అనిరుధ్‌.. మాణిక్యం ఠాగూర్‌కు ఘాటుగా లేఖ రాయడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

కాగా, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని అనిరుధ్‌ రెడ్డి వ్యతిరేకించారు. ఆయన చేరికపై అనిరుధ్‌ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సొంత తమ్ముడినే హత్య చేసిన వ్యక్తి ఎర్ర శేఖర్‌ అనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. 9 మర్డర్‌ కేసుల్లో సంబంధం ఉన్న ఎర్రశేఖర్‌తో స్టేజ్‌ పంచుకోలేను. కోమటిరెడ్డి అనుచరుడిని కాబట్టే నన్ను డిస్టర్జ్‌ చేస్తున్నారు. నేను ఇక్కడ పోటీలో ఉంటే అది కాంగ్రెస్‌కు ప్లస్‌ అవుతుంది. లేదంటే మరో హుజురాబాద్‌ అవుతుందని ఘాటుగా స్పందించారు. టీడీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు నన్ను పనులు చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. నా కేడర్‌ వారికి తగిన బుద్ది చెబుతుందని వార్నింగ్‌ ఇచ్చారు. 

ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ అధిష్టానానికి లేఖ రాశారు. కాగా, బుధవారం జరిగిన సమీక్షా సమావేశం మధ్యలోనే మహేశ్వర్‌ రెడ్డి వెళ్లిపోయారు. దీంతో ఏఐసీసీ సెక్రటరీ జావిద్‌.. మహేశ్వర్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో, మహేశ్వర్‌ రెడ్డి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. 

ఇది కూడా చదవండి: మర్రి శశిధర్‌ రెడ్డికి కౌంటర్‌

మరిన్ని వార్తలు