మార్షల్స్‌పై టీడీపీ ఎమ్మెల్యేల దాడి

1 Dec, 2020 18:26 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. సభకు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారనే కారణంగా ఒక్క రోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నానని స్పీకర్‌ ప్రకటించారు. వరుసగా రెండో రోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి వెళ్లాలని స్పీకర్‌ ఆదేశించినప్పటికీ టీడీపీ సభ్యులు అక్కడే ఉన్నారు. దీంతో మార్షల్స్‌ వచ్చి వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ  ఎమ్మెల్యేలు మార్షల్స్‌పై దాడి చేశారు. మార్షల్స్‌ని కొట్టిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టపాటి రవి, సత్యప్రసాద్‌, ఏలూరు సాంబశివరావు, బాల వీరాంజనేయులు ఉన్నారు. మరోవైపు సస్సెండ్‌ అయిన సభ్యులతో కలిసి చంద్రబాబు బయటకు వెళ్లారు.
(చదవండి : మీ సంగతి చూస్తా.. స్పీకర్‌కు చంద్రబాబు బెదిరింపు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు