ఏపీ ఎన్నికలు: పవన్‌ను నమ్ముకుంటే.. ఖల్లాస్‌!

4 Jan, 2024 17:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ:  పవన్‌ను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడమా? బాబోయ్‌.. అనుకుంటోంది ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ. తాజాగా కోర్‌ కమిటీ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

తాడేపల్లిలో దాదాపు అయిదు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్దత, పొత్తుల అంశాలపై  కీలకంగా చర్చించారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సన్నద్దమవ్వాలనే దానిపై జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ జీ అభిప్రాయాలను సేకరించారు. పొత్తులపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలో ఉండాలని పలువురు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల శాతం పెరుగుతుందని నేతలు చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తీరుపైనా బీజేపీ నేతలు చర్చించగా.. పవన్‌ను నమ్ముకుంటే బీజేపీకి ఎదురుదెబ్బేనని పలువురు అభిప్రాయపడినట్లు వినికిడి. టీడీపీ-జనసేన పొత్తుపై చర్చించారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసి భంగపడిన అనుభవాలను నేతలు గుర్తుచేసుకున్నారట. 

ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగలమా? అనే అంశంపైనా అభిప్రాయ సేకరణ జరిపారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏయే సీట్లల్లో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉందనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ఏపీలో ఈ నెలలో అమిత్ షా పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రమంత్రి పర్యటన సమయంలోనే పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని నేతలు కోరారట.


చదవండి: చంద్రబాబుకి ఆ గేటు తెరిచే ఉద్దేశం లేదేమో!

whatsapp channel

మరిన్ని వార్తలు