ఎల్లో మీడియాపై డిప్యూటీ సీఎం కొట్టు ఫైర్‌

4 Feb, 2024 17:38 IST|Sakshi

సాక్షి,తాడేపల్లిగూడెం: ఎల్లో మీడియాపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పేవన్నీ వాస్తవాలని చెప్పారు. చంద్రబాబు అబద్ధాలకు రామోజీ వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఆదివారం ఆయన తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడారు. 

సీఎం జగన్‌ పిలుపుతో దెందులూరు సిద్ధం సభకు లక్షలాది మంది తరలి వచ్చారన్నారు. సభలో సీఎం జగన్‌ వాస్తవాల ప్రసంగంపై ఎల్లో మీడియా రోత రాతలు రాసిందని విమర్శించారు. బాబు హయాంలో దేవాలయాలను కూల్చివేసినపుడు రామోజీ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖలో పూర్తి పారదర్శకత తీసుకువచ్చి అవినీతి లేకుండా చేశామని చెప్పారు. దేవాదాయ ఆస్తుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వం మీద బురద జల్లేందుకే ఎల్లో మీడియా విషపు రాతలు రాసిందని కొట్టు మండిపడ్డారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega