నిరూపిస్తే రాజీనామా చేస్తా: నారాయణ స్వామి

28 Sep, 2020 19:03 IST|Sakshi

సాక్షి, తిరుపతి: చంద్రబాబుకు దమ్ముంటే మాజీ జడ్జి రామకృష్ణ సోదరుడిపై పెద్దిరెడ్డి మనుషులు దాడి చేసినట్లు నిరూపించాలి. అలా చేస్తే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. లేదంటే చంద్రబాబు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు. ఎంపీ రెడ్డెప్ప దళితుల పేరుతో కుట్రలకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో మాజీ జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్ర, ఇతరుల మధ్య గొడవ జరిగితే మంత్రి పెద్దిరెడ్డికి ఏం సంబంధం. దాడిలో పాల్గొన్న ప్రతాప్ రెడ్డి టీడీపీ నేత కాదా.. తెలుగుదేశం నాయకుల మధ్య గొడవలు జరిగితే మంత్రి పెద్దిరెడ్డి మీద నిందలు వేయడం సిగ్గు చేటు’ అన్నారు.

‘నిన్న బి కొత్తకోటలో జరిగిన గొడవ సందర్బంగా మాజీ జడ్జి రామకృష సోదరుడు రామచంద్ర మద్యం సేవించి ఉన్నారు. వైద్య పరీక్షల్లో ఇది నిర్ధారణ అయ్యింది. గొడవలో పాల్గొన్న ప్రతాప్ రెడ్డి తాను టీడీపీ నేతను అని చెప్పాడు. కానీ ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసింది’ అంటూ నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: కులాల మధ్య చంద్రబాబు చిచ్చు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు